వరల్డ్ కరాటే కింగ్‌ మన తెలుగోడే..!

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు యువకుడు సత్తాచాటాడు. విశాఖకు చెందిన భూపతిరాజు అన్మీష్‌ వర్మ.. ఆస్ట్రియాలో జరిగిన వరల్డ్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఈ మెడల్‌ సాధించిన తొలి తెలుగు యువకుడిగా అన్మీష్ వర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే పలు కరాటే చాంపియన్స్‌లో పాల్గొన్న వర్మ.. 57 మెడల్స్‌ గెలిచాడు. 2014 నుంచి తనకు ఎంతో ఇష్టమైన కరాటేలో సత్తాచాటుతున్నాడు భూపతి వర్మ. దేశానికి స్వర్ణ పతాకం తేవాలన్న కసితో.. మెడల్‌ సాధించిన తొలి తెలుగు […]

వరల్డ్ కరాటే కింగ్‌ మన తెలుగోడే..!
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 6:34 PM

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు యువకుడు సత్తాచాటాడు. విశాఖకు చెందిన భూపతిరాజు అన్మీష్‌ వర్మ.. ఆస్ట్రియాలో జరిగిన వరల్డ్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఈ మెడల్‌ సాధించిన తొలి తెలుగు యువకుడిగా అన్మీష్ వర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే పలు కరాటే చాంపియన్స్‌లో పాల్గొన్న వర్మ.. 57 మెడల్స్‌ గెలిచాడు. 2014 నుంచి తనకు ఎంతో ఇష్టమైన కరాటేలో సత్తాచాటుతున్నాడు భూపతి వర్మ. దేశానికి స్వర్ణ పతాకం తేవాలన్న కసితో.. మెడల్‌ సాధించిన తొలి తెలుగు యువకుడిగా నిలిచాడు. ఒక్క కరాటే కాకుండా కిక్‌ బాక్సింగ్‌లో అద్భుతంగా రాణించాడు వర్మ. ఇటు 2018లో గ్రీస్‌లో జరిగిన చాంపియన్‌ ట్రోఫీలో కూడా గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ప్రభుత్వం సపోర్ట్‌ ఉంటే మరిన్ని వరల్డ్‌ చాంపియన్‌ టోర్నీ రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.