జకోవిచ్‌ ఔట్.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు థీమ్‌

ప్యారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ 1 నొవాక్‌ జకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. హోరాహోరీగా జరిగిన పోరులో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్‌ థీమ్‌ విజయం సాధించాడు. 6-2, 3-6, 7-5, 5-7, 7-5 తేడాతో జకోను ఓడించాడు. మరోసారి వరుసగా అన్ని గ్రాండ్‌శ్లామ్‌ టైటిళ్లు రెండోసారి గెలవాలన్న అతడి కలను చిదిమేశాడు. సెమీస్‌లో గెలుపుతో టెన్నిస్‌ చరిత్రలో లెజెండ్ రాడ్‌ లావర్‌ సరసన నివాలని జకోవిచ్‌ కలగన్నాడు. కానీ […]

జకోవిచ్‌ ఔట్.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు థీమ్‌

ప్యారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ 1 నొవాక్‌ జకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. హోరాహోరీగా జరిగిన పోరులో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్‌ థీమ్‌ విజయం సాధించాడు. 6-2, 3-6, 7-5, 5-7, 7-5 తేడాతో జకోను ఓడించాడు. మరోసారి వరుసగా అన్ని గ్రాండ్‌శ్లామ్‌ టైటిళ్లు రెండోసారి గెలవాలన్న అతడి కలను చిదిమేశాడు.

సెమీస్‌లో గెలుపుతో టెన్నిస్‌ చరిత్రలో లెజెండ్ రాడ్‌ లావర్‌ సరసన నివాలని జకోవిచ్‌ కలగన్నాడు. కానీ అతడి ఆశలను థీమ్‌ కల్లలు చేశాడు. ఫైనల్లో ‘క్లే కోర్ట్ కింగ్’ రఫేల్‌ నాదల్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది ఫైనల్లోనూ వీరిద్దరే తలపడ్డ సంగతి తెలిసిందే. నువ్వానేనా అన్నట్టు జరిగిన ఆ పోరులో థీమ్‌ ఓడిపోయాడు. మరి ఈ సారైనా విజయం సాధిస్తాడేమో చూడాలి.