మరో ఐపీఎల్‌ జట్టులో కరోనా కలకలం

ఐపీఎల్‌లో మరో జట్టులో కరోనా కలకలం రేపింది. ఢిల్లీ కేపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌కు తాజాగా కరోనా సోకింది.

  • Tv9 Telugu
  • Publish Date - 7:07 am, Mon, 7 September 20
మరో ఐపీఎల్‌ జట్టులో కరోనా కలకలం

IPL 2020 Corona: ఐపీఎల్‌లో మరో జట్టులో కరోనా కలకలం రేపింది. ఢిల్లీ కేపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌కు తాజాగా కరోనా సోకింది. భారత్‌లో జరిపిన 2 టెస్ట్‌ల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చింది. అయితే దుబాయ్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అతడితో ఏ ఆటగాడు కాంటాక్ట్ కాలేదని ఢిల్లీ కేపిటల్స్ ప్రకటించింది. 14 రోజుల పాటు అతడు ఐసోలేషన్‌లో ఉండారని, ఆ తరువాత రెండు సార్లు నెగిటివ్ వస్తే, టీమ్‌తో కలుస్తారని వారు తెలిపారు.

ప్రస్తుతం అతడితో టీమ్ సభ్యులు కాంటాక్ట్‌లో ఉన్నామని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఢిల్లీ కేపిటల్స్ టీమ్‌ వెల్లడించింది. అయితే దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ని దుబాయ్‌లో ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన చెన్నై సూపర్‌కింగ్స్‌ టీమ్‌లో 13 మందికి కరోనా సోకింది. వారందరూ ఇటీవల కోలుకున్నారు. ఇక ఆ తరువాత దుబాయికి వెళ్లకముందే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్‌ కోచ్‌ దిషంత్‌ యగ్నిక్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు.

Read More:

2కేజీల ఇసుకను దొంగలించినందుకు 86వేల ఫైన్‌

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు