ఇంగ్లాండ్ జట్టుకు ఈజీగా 400 రన్స్.. అలెస్టర్ కుక్ జోస్యం

ప్రపంచకప్‌లో అత్యంత కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన ఆట తీరుతో అందరిని అలరిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని అందించారు. దీనితో ఆతిధ్య ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఓ మీడియా సమావేశంలో ఈ మ్యాచ్‌పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. కుక్ మాట్లాడుతూ..’ఇండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 400 పరుగులు సాధిస్తుందని […]

  • Ravi Kiran
  • Publish Date - 4:55 pm, Sun, 30 June 19
ఇంగ్లాండ్ జట్టుకు ఈజీగా 400 రన్స్.. అలెస్టర్ కుక్ జోస్యం

ప్రపంచకప్‌లో అత్యంత కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుతమైన ఆట తీరుతో అందరిని అలరిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని అందించారు. దీనితో ఆతిధ్య ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఓ మీడియా సమావేశంలో ఈ మ్యాచ్‌పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

కుక్ మాట్లాడుతూ..’ఇండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 400 పరుగులు సాధిస్తుందని చెప్పాడు. ఆ జట్టులో అపారమైన సామర్ధ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారని.. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరగని ఇండియాపై 400 పరుగులు చేయడం ఖాయం’ అని తేల్చి చెప్పాడు.

మరోవైపు ప్రపంచకప్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఇటీవల ఆడిన మూడు మ్యాచ్‌లలో పరాజయం ఎదుర్కొని సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో భారత్‌తో జరిగే ఈ మ్యాచ్ వారికి అత్యంత కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్లు.. భారత్ బౌలింగ్‌ను ఆటాడుకుంటున్నారు. బెయిర్‌స్టో, రాయ్‌లు అర్ధసెంచరీలతో అదరగొట్టారు. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోయి 180 పరుగులు చేసింది. బెయిర్‌స్టో(98), రూట్ (11) క్రీజులో ఉన్నారు.  జాసన్ రాయ్ 66 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.