బెయిర్‌స్టో సెంచరీ… భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్!

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్ లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఆ జట్టు ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్‌స్టోలు.. భారత్ బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. జాసన్ రాయ్ అర్ధ సెంచరీ చేసి ఔటవ్వగా.. బెయిర్‌స్టో సెంచరీతో కదం తొక్కాడు. 30 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోయి 202 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 111 పరుగులతోనూ, జో రూట్ 20 […]

  • Ravi Kiran
  • Publish Date - 5:12 pm, Sun, 30 June 19
బెయిర్‌స్టో సెంచరీ... భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్!

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్ లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఆ జట్టు ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్‌స్టోలు.. భారత్ బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. జాసన్ రాయ్ అర్ధ సెంచరీ చేసి ఔటవ్వగా.. బెయిర్‌స్టో సెంచరీతో కదం తొక్కాడు. 30 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోయి 202 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 111 పరుగులతోనూ, జో రూట్ 20 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.