Womens T20WC 2024 Prize Money: భారీగా పెరిగిన టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ.. విజేతకు ఎంత దక్కనున్నాయంటే?

|

Sep 27, 2024 | 1:54 PM

Women’s T20 World Cup 2024 Prize Money: 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 అక్టోబర్ 3 నుంచి UAEలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. UAEలో జరగనున్న మహిళల T20 ప్రపంచకప్ కోసం ఐసీసీ $7,958,080 (దాదాపు రూ. 66.5 కోట్లు) ప్రైజ్ మనీని ప్రకటించింది.

Womens T20WC 2024 Prize Money: భారీగా పెరిగిన టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ.. విజేతకు ఎంత దక్కనున్నాయంటే?
Women's T20 World Cup
Follow us on

Women’s T20 World Cup 2024 Prize Money: 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 అక్టోబర్ 3 నుంచి UAEలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. UAEలో జరగనున్న మహిళల T20 ప్రపంచకప్ కోసం ఐసీసీ $7,958,080 (దాదాపు రూ. 66.5 కోట్లు) ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈమేరకు 2023లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు గెలుచుకున్న $1 మిలియన్ (రూ. 8.4 కోట్లు) కంటే భారీగా పెరిగింది. అంటే, ఈ ఏడాది విజేతగా నిలిచే జట్టుకు $2.34 మిలియన్లు (దాదాపు రూ. 19.6 కోట్లు)గా ప్రకటించింది.

2024 మహిళల T20 ప్రపంచ కప్ అక్టోబర్ 3న షార్జాలో ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తొలి రోజు బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్‌, పాకిస్థాన్‌ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో ప్రైజ్ మనీ ఎలా ఉందో ఓసారి చూద్దాం..

– విజేతకు: $2.34 మిలియన్ (రూ. 19.6 కోట్లు)

ఇవి కూడా చదవండి

– రన్నరప్: $1.17 మిలియన్ (రూ. 9.8 కోట్లు)

– సెమీఫైనలిస్ట్‌లకు: $675,000 (రూ. 5.7 కోట్లు)

– 5 నుంచి 8వ స్థానంలో నిలిచిన జట్లకు: ఒక్కొక్కటిగా $270,000 (రూ. 2.25 కోట్లు)

– 9వ, 10వ స్థానాల్లో నిలిచిన జట్లు: ఒక్కొక్కటి $135,000 (రూ. 1.13 కోట్లు)

– ఒక్కో గ్రూప్-స్టేజ్ విజయం సాధించిన జట్టుకు: $31,154 (రూ. 26 లక్షలు)

– లీగ్ దశలో పాల్గొనే జట్లకు: $112,500 (రూ. 94 లక్షలు)

ఇంతకుముందు ఈ టోర్నమెంట్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే అక్కడ రాజకీయ అస్థిరతతో నిరసనలు చోటుచేసుకున్నాయి. భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ టోర్నమెంట్‌ను యుఎఇలో నిర్వహించాలని నిర్ణయించారు. షార్జా, దుబాయ్ మైదానాల్లో ఐసీసీ మ్యాచ్‌లు జరగనున్నాయి.

మరోవైపు ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళల క్రికెట్‌ను ICC ఉంచింది. ఇప్పుడు ఐసీసీ ఈవెంట్లలో పురుషుల క్రికెట్ జట్టు గెలుచుకున్న ప్రైజ్ మనీ మహిళల క్రికెట్‌కు కూడా అంతే మొత్తం అవుతుంది. ఇది ఈ ఏడాది T20 ప్రపంచకప్ 2024 నుంచి ప్రారంభం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..