అఫ్గాన్ జట్టును వెంటనే నిషేధించాలి.. అక్తర్ డిమాండ్

అఫ్గాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లందరూ పాకిస్థాన్ జాతీయులేనని.. ఆ జట్టును వెంటనే రద్దు చేయాలని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. అఫ్గాన్ జట్టు సభ్యులంతా పాకిస్థాన్‌లోని పెషావర్ ప్రాంతానికి చెందిన వారు.. ఆ విషయం వారి గుర్తింపు కార్డులు చూస్తే స్పష్టమవుతుందని అక్తర్ తెలిపాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆ జట్టును రద్దు చేయాలని డిమాండ్ చేశాడు.’అఫ్గాన్‌లో ఇండియా భారీగా పెట్టుబడులు పెట్టినా… అఫ్గానీయులు ఆలోచనా విధానాన్ని భారత్ మార్చలేకపోయిందని’ అక్తర్ దుయ్యబట్టాడు. ఇక […]

అఫ్గాన్ జట్టును వెంటనే నిషేధించాలి.. అక్తర్ డిమాండ్
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 30, 2019 | 10:15 PM

అఫ్గాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లందరూ పాకిస్థాన్ జాతీయులేనని.. ఆ జట్టును వెంటనే రద్దు చేయాలని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. అఫ్గాన్ జట్టు సభ్యులంతా పాకిస్థాన్‌లోని పెషావర్ ప్రాంతానికి చెందిన వారు.. ఆ విషయం వారి గుర్తింపు కార్డులు చూస్తే స్పష్టమవుతుందని అక్తర్ తెలిపాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆ జట్టును రద్దు చేయాలని డిమాండ్ చేశాడు.’అఫ్గాన్‌లో ఇండియా భారీగా పెట్టుబడులు పెట్టినా… అఫ్గానీయులు ఆలోచనా విధానాన్ని భారత్ మార్చలేకపోయిందని’ అక్తర్ దుయ్యబట్టాడు.

ఇక అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం అక్తర్‌ను తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు.. పాకిస్థాన్‌ను ఓడించినంత పని చేసింది కాబట్టే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.