IND vs AUS: ఇదేందయ్యా ఇది.. 7 ఏళ్లుగా సెంచరీ లేదు.. కోహ్లీ, రోహిత్ పేలవఫాంకు ఇదే నిదర్శనమా?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత కొంతకాలంగా బ్యాటింగ్ చేయడం మరిచిపోయినట్టున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టు సిరీస్‌లో వీరిద్దరూ చెత్త బ్యాట్స్‌మెన్స్‌గా నిరూపించుకుని జట్టు ఓటమికి ప్రధాన కారణమని తేలారు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో వీరిద్దరూ ఈ పరిస్థితిని మార్చగలరా అన్నదే ఇప్పుడు అందరి దృష్టి.

IND vs AUS: ఇదేందయ్యా ఇది.. 7 ఏళ్లుగా సెంచరీ లేదు.. కోహ్లీ, రోహిత్ పేలవఫాంకు ఇదే నిదర్శనమా?
Rohti Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Nov 12, 2024 | 12:36 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టుల సిరీస్ ఆడాల్సిన భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత భారత్‌కు ఈ పర్యటన చాలా కీలకం. న్యూజిలాండ్‌పై పూర్తిగా విఫలమైన విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. వీరిద్దరి పేలవమైన ఫామ్ టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తుంది. ఇంతకు ముందు ఎవరూ గమనించని ఒక నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత 7 ఏళ్లలో టీమిండియాకు చెందిన ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్లు టెస్టు క్రికెట్‌లో ఒక్కసారి కూడా సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక దశాబ్దానికి పైగా టీమ్ ఇండియాలో ముఖ్యమైన భాగంగా ఉన్నారు. మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు కీలక బ్యాట్స్‌మెన్‌గా మారారు. వీరిద్దరూ ప్రతి ఫార్మాట్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. విభిన్న ఆటగాళ్లతో ఎన్నో భాగస్వామ్యాలు చేశారు. ODI, T20 లలో, రోహిత్, విరాట్ కలిసి చాలా సెంచరీ భాగస్వామ్యాలు చేశారు. టీమ్ ఇండియా కోసం మ్యాచ్‌లను గెలిపించారు. కానీ, టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే, వీరిద్దరి మధ్య పెద్ద భాగస్వామ్యాన్ని చూడాలని భారత అభిమానులు ఆరాటపడుతున్నారు.

గత 7 సంవత్సరాలుగా భారీ భాగస్వామ్యం లేదు..

విరాట్ తన టెస్ట్ అరంగేట్రం నుంచి టీమ్ ఇండియాలో స్థిరమైన భాగంగా ఉన్నాడు. అయితే, 2013లో అరంగేట్రం చేసినప్పటికీ, ఈ ఫార్మాట్‌లో రోహిత్ తన స్థానాన్ని కాపాడుకోవడానికి చాలా సమయం పట్టింది. అతను 2019 లో ఓపెనింగ్ ప్రారంభించినప్పటి నుంచి అతను జట్టులో రెగ్యులర్ భాగమయ్యాడు. ఇప్పుడు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఈ కాలంలో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ చాలా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడారు. కానీ, గత 7 ఏళ్లలో ఒకరితో ఒకరు పెద్దగా భాగస్వామ్యాన్ని చేయలేకపోయారు.

జనవరి 1, 2018 నుంచి 34 టెస్టు మ్యాచ్‌ల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి, రోహిత్ కలిసి బ్యాటింగ్ చేశారు. అయితే ఈ కాలంలో ఒక్కసారి కూడా సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారని గణాంకాలు చెబుతున్నాయి. సెంచరీ భాగస్వామ్యాన్ని వదిలిస్తే.. ఈ 12 ఇన్నింగ్స్‌లలో ఇద్దరి మధ్య ఒకే ఒక యాభై భాగస్వామ్యం ఉంది. అందులో కూడా వారు 64 పరుగులకే చేశారు. ఈ 12 ఇన్నింగ్స్‌ల్లో వీరిద్దరి భాగస్వామ్యం ఎలా ఉందో ఓసారి చూద్దాం.. 32, 25, 23, 1, 0, 64, 1, 17, 16, 2, 18, 23.

ఇద్దరు స్టార్లు ఆస్ట్రేలియాలో మెరుస్తారా?

అయితే, ఇద్దరూ సెంచరీ భాగస్వామ్యం చేయలేదని కాదు. 2018కి ముందు, టీమిండియాకు సహాయం చేయడానికి, అభిమానులను సంతోషపెట్టడానికి వీరిద్దరూ మూడుసార్లు పెద్ద భాగస్వామ్యాలు చేశారు. రోహిత్ అరంగేట్రం చేసినప్పటి నుంచి, ఇద్దరూ కలిసి మొత్తం 26 సార్లు బ్యాటింగ్ చేశారు. ఇందులో వారు 39 సగటుతో 999 పరుగులు జోడించారు. ఇందులో 3 సెంచరీ భాగస్వామ్యాలు, 4 అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇప్పుడు భారత జట్టుతోపాటు అభిమానులు ఆస్ట్రేలియాలో స్టార్ బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ తమ ఫామ్‌కు తిరిగి రావాలని, కొన్ని పెద్ద భాగస్వామ్యాలు చేయడం ద్వారా విజయంలో కీలక పాత్ర పోషిస్తారని అంతా ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా
పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా
పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
సైలెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?
సైలెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?
వామ్మో.. ఆహారాన్ని తొందర తొందరగా తింటున్నారా.. డేంజర్‌లో పడినట్టే
వామ్మో.. ఆహారాన్ని తొందర తొందరగా తింటున్నారా.. డేంజర్‌లో పడినట్టే
BSNL కీలక నిర్ణయం.. ఆ 48 ప్రదేశాల్లో ఉచిత వైఫై.. టవర్ల ఏర్పాటు!
BSNL కీలక నిర్ణయం.. ఆ 48 ప్రదేశాల్లో ఉచిత వైఫై.. టవర్ల ఏర్పాటు!
రెడ్‌మీ కొత్త సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి.
రెడ్‌మీ కొత్త సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి.
యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు
యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు
Flipkart: ఐఫోన్‌తో సహా ఈ ప్రోడక్ట్‌లపై 80 శాతం తగ్గింపు..!
Flipkart: ఐఫోన్‌తో సహా ఈ ప్రోడక్ట్‌లపై 80 శాతం తగ్గింపు..!
14 నెలల పసికందుకు విజయవంతంగా గుండె మార్పిడి.. దాత ఎవరంటే..
14 నెలల పసికందుకు విజయవంతంగా గుండె మార్పిడి.. దాత ఎవరంటే..
సుకుమార్ నిర్మాతగా నాగ చైతన్య థ్రిల్లర్ సినిమా.. దర్శకుడు ఎవరంటే?
సుకుమార్ నిర్మాతగా నాగ చైతన్య థ్రిల్లర్ సినిమా.. దర్శకుడు ఎవరంటే?