IND vs SA: ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం.. యువ అటగాడు వెంకటేశ్ అయ్యర్..

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత వన్డే జట్టును ప్రకటించారు. ఈ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు.

IND vs SA: ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం.. యువ అటగాడు వెంకటేశ్ అయ్యర్..
Iyyar
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 03, 2022 | 9:46 AM

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత వన్డే జట్టును ప్రకటించారు. ఈ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఇందులో మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేష్ అయ్యర్ పేరు కూడా ఉంది. అయ్యర్ IPL-2021లో రాణించడంతో ICC T20 ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే కివీస్‎తో సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టులో అయ్యర్ ఓపెనర్‌గా ఆడాడు. కానీ న్యూజిలాండ్‌పై అతను అంతగా ప్రభావం చూపలేదు. అయ్యర్ ఇటీవలి విజయ్ హజారే ట్రోఫీలో మళ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. దీని ఆధారంగా అతను వన్డే జట్టులోకి వచ్చాడు.

గత మ్యాచ్‎ల్లో అయ్యర్ మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో అయ్యర్ మిడిల్ లేదా లోయర్ ఆర్డర్‌లో ఆడే అవకాశం కూడా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అయ్యరు చెప్పాడు. అయ్యర్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు? వెంకటేష్ మాట్లాడుతూ ”ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.” అని చెప్పాడు.

హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా అయ్యర్‌ను సన్నద్ధం చేయాలనుకోవడం టీమ్ ఇండియాలో అయ్యర్‌ను ఎంపిక చేయడం ఒక కారణం. అయ్యర్ కూడా వేగంగా బౌలింగ్ చేస్తాడు. అతను ఐపీఎల్‌లో తన అద్భుతమైన బౌలింగ్ విధానాన్ని ప్రదర్శించాడు. పాండ్యా గత కొన్ని నెలలుగా గాయాలతో పోరాడుతున్నాడు.

Read Also.. IND vs SA: భారత్‌తో వన్డే సిరీస్‌కి జట్టుని ప్రకటించిన సౌతాఫ్రికా.. స్థానం సంపాదించిన కొత్త బౌలర్..

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

బీఆర్ఎస్‎కు బిగ్ షాక్.. కాంగ్రెస్‎లో చేరనున్న మరో ఎమ్మెల్యే..

పర్పుల్ క్యాప్‌లో అగ్రస్థానికి యార్కర్ కింగ్..

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

చిన్నదే కానీ.. చిటికెలో ఇల్లంతా చల్లబరుస్తుంది.. ధర ఎంతో తెలిస్తే

దూరదర్శన్‌ లోగో మార్పుపై నెటిజన్ల ఫైర్‌.. కారణం ఇదే!

కేసీఆర్‌ అల్లుడిపై మరో కేసు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదుతో..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 