Video: ఇదెక్కడి విడ్డూరం.. క్రికెట్‌ చరిత్రలోనే ఇలాంటి వీడియో చూసి ఉండరు.. బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేసిన పంత్

Rishabh Pant Video: రిషబ్ పంత్, శుభ్‌మన్‌ల అద్భుతమైన భాగస్వామ్యానికి బంగ్లాదేశ్ జట్టు బౌలర్లు అవాక్కయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో చాలాసార్లు ఫీల్డింగ్ మార్చినా ఫలితం లేకుండా పోయింది. కాగా, ఫీల్డింగ్ మార్పు బంగ్లాదేశ్ కెప్టెన్‌కు కొత్త సవాలుగా మారింది.

Video: ఇదెక్కడి విడ్డూరం.. క్రికెట్‌ చరిత్రలోనే ఇలాంటి వీడియో చూసి ఉండరు.. బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేసిన పంత్
Rishabh Pant Video
Follow us

|

Updated on: Sep 21, 2024 | 6:54 PM

India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్-భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఆసక్తికర సంఘటనకు సాక్షిగా నిలిచింది. అలాంటి ఆసక్తికర పరిస్థితిని ఏర్పరించింది ఎవరో కాదు.. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. అది కూడా బ్యాటింగ్ చేసే సమయంలో ఫీల్డింగ్ సెట్ చేయడం గమనార్హం. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరపున పంత్, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నారు.

రిషబ్ పంత్, శుభ్‌మన్‌ల అద్భుతమైన భాగస్వామ్యానికి బంగ్లాదేశ్ జట్టు బౌలర్లు అవాక్కయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో చాలాసార్లు ఫీల్డింగ్ మార్చినా ఫలితం లేకుండా పోయింది. కాగా, ఫీల్డింగ్ మార్పు బంగ్లాదేశ్ కెప్టెన్‌కు కొత్త సవాలుగా మారింది.

ఈ విషయాన్ని గ్రహించిన రిషబ్ పంత్ బంగ్లాదేశ్ కెప్టెన్ ఫీల్డింగ్ సెటప్‌లోని లోపాలను ఎత్తి చూపాడు. అలాగే, రిషబ్ పంత్ ఇక్కడ ఫీల్డర్ కావాలని మిడ్ వికెట్ వైపు సైగ చేయడం చూడొచ్చు.

రిషబ్ పంత్ వైరల్ వీడియో..

ఇది గమనించిన బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో పంత్ సలహా మేరకు ఫీల్డర్‌ను ఆపేశాడు. తన బ్యాటింగ్ సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ సెట్ చేసిన రిషబ్ పంత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే, ఈ వీడియోకు క్రీడాభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 128 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో 109 పరుగులు చేసి పెవలియన్ చేరాడు. ఈ అద్భుత సెంచరీ సాయంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసి డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..