Dinesh Karthik : మహిళలకు క్షమాపణలు చెప్పిన టీమ్ ఇండియా ప్లేయర్..! ఎందుకో తెలుసా..?

Dinesh Karthik : మహిళలకు క్షమాపణలు చెప్పిన టీమ్ ఇండియా ప్లేయర్..! ఎందుకో తెలుసా..?
Dinesh Karthik

Dinesh Karthik : టీమ్ ఇండియా ప్లేయర్ దినేశ్ కార్తీక్ ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మహిళల రెండో వన్డే సందర్భంగా మహిళలను ఉద్ధేశించి అనుచిత

uppula Raju

|

Jul 05, 2021 | 6:17 AM

Dinesh Karthik : టీమ్ ఇండియా ప్లేయర్ దినేశ్ కార్తీక్ ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మహిళల రెండో వన్డే సందర్భంగా మహిళలను ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడి కామెంట్స్‌పై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేగడంతో సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. దీంతో దినేశ్ కార్తీక్ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. స్కై స్పోర్ట్స్‌లో ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డే సందర్భంగా దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘గత మ్యాచ్‌లో మాట్లాడిన దానికి క్షమాపణలు కోరుతున్నాను. నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను తప్పు చేశాను అందరికీ క్షమాపణలు కోరుతున్నాను. ఈ మాటలు మాట్లాడినందుకు నేను నా తల్లి, భార్య నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నాను’ అని తెలిపాడు.

కాగా దినేశ్ కార్తీక్ రెండో వన్డే సందర్భంగా కామెంట్రీ చేస్తూ.. ‘‘బ్యాట్స్‌మెన్ బ్యాట్లను ఇష్టపడకపోవడమనేది రెండు వేర్వేరు విషయాలు కావు. చాలామంది బ్యాట్స్‌మెన్‌ తమ బ్యాట్లను ఇష్టపడ్డట్లు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారు. బ్యాట్లనేవి చుట్టుపక్కల ఉండే పరాయి పురుషుల భార్యల్లాంటివి. అవెప్పుడూ సౌకర్యవంతంగా ఉంటాయి’’ అని వ్యాఖ్యానించాడు.

దినేష్ కార్తీక్ ఇంకా క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. ఐపిఎల్, దేశీయ క్రికెట్లలో నిరంతరం ఆడుతున్నాడు. అతను చివరిసారిగా 2019 సంవత్సరంలో భారతదేశం తరఫున ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతను టీమ్ ఇండియా జెర్సీలో అడుగుపెట్టాడు. అతడు మళ్లీ భారత జట్టులో చోటు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అవకాశం లభించడం లేదు. ఇటీవలి శ్రీలంక పర్యటనకు అతన్ని ఎంపిక చేస్తారని అనుకున్నారు కానీ సెలెక్టర్లు అతని స్థానంలో సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.

లోని పై కేసులో 11 మందిపై యూపీ పోలీసుల చార్జిషీట్.. మళ్ళీ ట్విటర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు

TeamIndia: కెప్టెన్ ను మార్చాలా.. వద్దా.. అనేది పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుంది: మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా

Telangana Corona Updates: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య.. తాజాగా ఎన్ని కేసులంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu