Team India: రోహిత్, గిల్‌పై గంభీర్ ప్రశంసలు.. కోహ్లీ ఇన్నింగ్స్‌పై కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..!

ఈ మ్యాచ్-విన్నింగ్ ప్రదర్శనతో రోహిత్ శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు లభించింది. సీనియర్ ఆటగాళ్లు జట్టుకు ఇంకా చాలా అందించగలరని ఈ ప్రదర్శన నిరూపించింది. ఈ డ్రెస్సింగ్ రూమ్ దృశ్యాలు, గంభీర్ ప్రశంసలు బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Team India: రోహిత్, గిల్‌పై గంభీర్ ప్రశంసలు.. కోహ్లీ ఇన్నింగ్స్‌పై కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..!
Ind Vs Aus

Updated on: Oct 27, 2025 | 3:26 PM

India vs Australia: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ల భాగస్వామ్యాన్ని, ముఖ్యంగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ల నిలకడైన ఆటతీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ తరువాత విరాట్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రోహిత్ – శుభ్‌మన్ భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి..

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో (SCG) ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం ఎంతో కీలకమైందని గంభీర్ అభివర్ణించారు.

గంభీర్ మాట్లాడుతూ, “బ్యాటింగ్‌లో, శుభ్‌మన్, రోహిత్‌ల మధ్య నెలకొల్పిన భాగస్వామ్యం చాలా చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా 60 పరుగులకు వికెట్ కోల్పోకుండా మంచి పునాది వేశారు” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్-కోహ్లీల చారిత్రక ఛేజింగ్‌పై..

గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి అజేయంగా 168 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ (121 నాటౌట్) చేయగా, కోహ్లీ 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ ప్రదర్శనపై గౌతమ్ గంభీర్ ఉప్పొంగిపోయారు.

గంభీర్ మాట్లాడుతూ “ఆ తరువాత రోహిత్, విరాట్ మధ్య భాగస్వామ్యం కూడా అద్భుతంగా ఉంది. ఇది చాలా క్లినికల్‌గా (నిర్ణయాత్మకంగా) కూడా ఉంది” అంటూ పొగడ్తలు ముంచెత్తారు.

రోహిత్, కోహ్లీల గురించి గంభీర్ ప్రత్యేక ప్రశంస..

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీని పూర్తి చేయడంతో పాటు, ఆస్ట్రేలియాపై భారత్‌కు ఓదార్పు విజయాన్ని అందించడంలో వారిద్దరి కృషిని గంభీర్ కొనియాడారు. గంభీర్ ప్రత్యేకంగా రోహిత్‌ను ప్రస్తావిస్తూ, “మరో సెంచరీ చేసిన ‘రో’ (రోహిత్ శర్మ)కి ప్రత్యేక అభినందనలు. అద్భుతమైన ఇన్నింగ్స్! అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఈ మ్యాచ్‌ను ముగించావు. విరాట్ కూడా అలాగే!” అని అన్నారు.

ఈ మ్యాచ్-విన్నింగ్ ప్రదర్శనతో రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది. సీనియర్ ఆటగాళ్లు జట్టుకు ఇంకా చాలా అందించగలరని ఈ ప్రదర్శన నిరూపించింది. ఈ డ్రెస్సింగ్ రూమ్ దృశ్యాలు, గంభీర్ ప్రశంసలు బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..