Team India: మహ్మద్ షమీతో ఉన్న టీమిండియా మాజీ పేసర్ ఎవరో గుర్తించగలరా? పేరు చెబితే క్రికెట్‌లో మీరు తోపులే..

|

Sep 24, 2024 | 9:42 AM

Mohammed Shami: మహ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించాడు. కేవలం 7 మ్యాచ్‌లు ఆడిన షమీ.. మొత్తం 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ టోర్నీ సందర్భంగా షమీ కాళ్ల నొప్పితో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న అతను ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో షమీ ఓ ఫొటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Team India: మహ్మద్ షమీతో ఉన్న టీమిండియా మాజీ పేసర్ ఎవరో గుర్తించగలరా? పేరు చెబితే క్రికెట్‌లో మీరు తోపులే..
Mohammed Shami
Follow us on

Mohammed Shami: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం ఫిట్‌నెస్ కసరత్తుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో షమీ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశాడు. అది కూడా భారత జట్టు మాజీ పేసర్‌తో కావడం విశేషం. అయితే, ఈ ఫొటో చూసిన చాలా మందికి షమీతో ఉన్న మాజీ ఆటగాడు ఎవరంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీమిండియా మాజీ పేసర్ లుక్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా భారత్ తరపున ఆడుతున్నప్పుడు సన్నగా ఉండే ఆటగాడు రిటైర్మెంట్ తర్వాత తన లుక్ మార్చుకున్నాడు. అందుకే షమీతో ఆటగాడు ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

ఇప్పుడు ఈ చర్చకు బ్రేక్ పడింది. మహ్మద్ షమీతో కనిపించిన టీమిండియా మాజీ ఆటగాడు పేరు అశోక్ దిండా. భారత్ తరపున 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దిండా 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. షమీ షేర్ చేసిన ఫొటో ద్వారా అశోక్ దిండా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు.

అశోక్ దిండా భారత్ తరపున 13 వన్డేలు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. అలాగే టీమిండియా తరపున 9 టీ20 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు పడగొట్టడంలో సఫలమయ్యాడు. అలాగే, అతను 78 ఐపీఎల్ మ్యాచ్‌ల నుంచి మొత్తం 69 వికెట్లు తీశాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అశోక్ దిండా ఇప్పుడు రిటైర్మెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేని మహ్మద్ షమీ, న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో కనిపించడం అనుమానంగా ఉంది. ఎందుకంటే, పూర్తి ఫిట్ నెస్ సాధించకుండా మళ్లీ మైదానంలోకి రానని షమీ చెప్పాడు. కాబట్టి, ఆస్ట్రేలియాతో సిరీస్‌తో మహ్మద్ షమీ పునరాగమనం చేస్తారని ఆశించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..