టీమిండియాలో హార్దిక్ పాండ్యా ఓ తోపు.. ఆ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు: టీమిండియా మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 కోసం సన్నాహాలు చేస్తున్న తరుణంలో, హార్దిక్ పాండ్యా పాత్ర మరింత కీలకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అతను పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండి, బ్యాట్, బాల్‌తో రాణిస్తే, భారత్ జట్టుకు అది గొప్ప బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

Team India: దక్షిణాఫ్రికాతో జరగబోయే ముఖ్యమైన టీ20 అంతర్జాతీయ సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (Sanjay Bangar) కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ జట్టులో ‘ఇర్రిప్లేసబుల్’ (Irreplaceable) అంటే, ఎవరూ భర్తీ చేయలేని ఆటగాడు అని బంగర్ అభివర్ణించారు.
హార్దిక్ ఎందుకు ప్రత్యేకమంటే..!
వికెట్ల మధ్యలో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం, అలాగే నలుగురు ప్రధాన పేసర్లలో ఒకరిగా తన కోటా అయిన నాలుగు ఓవర్లను పూర్తి చేయగల సత్తా హార్దిక్‌కు ఉంది. ఈ ప్రత్యేకమైన సమతుల్యత కారణంగా భారత జట్టులో అతని స్థానం అత్యంత ముఖ్యమైనదని బంగర్ స్పష్టం చేశారు.
సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. “హార్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్‌లలో జట్టుకు అందించే సమతుల్యత చాలా అద్భుతమైనది. అతను లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు, అదే సమయంలో నలుగురు పేసర్లలో ఒకరిగా నాలుగు ఓవర్లు వేయగలడు. ఈ కారణంగానే టీమిండియాలో అతని స్థానం అసాధారణమైనది, దానిని ఎవరూ భర్తీ చేయలేరు” అని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్ సన్నాహకాలలో కీలక పాత్ర..
టీమిండియా రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 కోసం సన్నాహాలు చేస్తున్న తరుణంలో, హార్దిక్ పాండ్యా పాత్ర మరింత కీలకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అతను పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండి, బ్యాట్, బాల్‌తో రాణిస్తే, భారత్ జట్టుకు అది గొప్ప బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
దక్షిణాఫ్రికాతో జరిగే ఈ టీ20 సిరీస్.. హార్దిక్ పాండ్యా తన ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి, జట్టులో తన ‘ఇర్రిప్లేసబుల్’ హోదాను మరోసారి నిలబెట్టుకోవడానికి ఒక మంచి వేదిక కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




