Vijay Hazare trophy: లీగ్‌లో సంచలనంగా శివం శర్మ.. 5 మ్యాచుల్లో 18 వికెట్లు.. మరో ఆణిముత్యం

విజయ్ హజారే ట్రోఫీ యొక్క లీగ్ దశ ముగిసిన తరువాత, బ్యాట్స్ మెన్ హృదయాలలో అత్యంత భయాన్ని సృష్టించిన ఒక బౌలర్ పేరు శివం శర్మ. ఉత్తర ప్రదేశ్ తరఫున ఆడుతున్న...

Vijay Hazare trophy: లీగ్‌లో సంచలనంగా శివం శర్మ.. 5 మ్యాచుల్లో 18 వికెట్లు.. మరో ఆణిముత్యం
Follow us

|

Updated on: Mar 02, 2021 | 3:58 PM

Vijay Hazare trophy:  విజయ్ హజారే ట్రోఫీ యొక్క లీగ్ దశ ముగిసిన తరువాత, బ్యాట్స్ మెన్ హృదయాలలో అత్యంత భయాన్ని సృష్టించిన ఒక బౌలర్ పేరు శివం శర్మ. ఉత్తర ప్రదేశ్ తరఫున ఆడుతున్న శివమ్ లీగ్ దశలోని ఐదు మ్యాచ్‌ల్లో అత్యధికంగా 18 వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తరుఫున శివం ఆడాడు. శివమ్ ఆల్ రౌండర్. కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్.  ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో, శివం శర్మ తన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు.

విజయ్ హజారే ట్రోఫీ 2021 లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో శివం శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. 5 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. వాటిలో బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఇందులో 31 పరుగులకు చేసి ఏడు వికెట్లు తీశాడు.  5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రిషి ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడవ స్థానంలో గుజరాత్‌కు చెందిన ఎఆర్ నాగ్వాస్వాలా ఉన్నాడు. ఇతగాడు 5 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్‌కు చెందిన సిద్ధార్థ్ కౌల్  5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదవ స్థానంలో ముంబైకి చెందిన ధావల్ కులకర్ణి 4 మ్యాచ్‌ల్లో 13 మంది బ్యాట్స్‌మెన్లను వేటాడాడు.

రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు

శివం శర్మ విషయానికొస్తే, కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. కేరళపై 1 వికెట్ దక్కించుకున్నాడు. బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో 7గురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. తదుపరి రైల్వేతో జరిగిన మ్యాచ్‌లో 1 వికెట్ తీసుకున్నాడు. ఒడిశాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఈ ఉత్తరప్రదేశ్ స్పిన్నర్ కేవలం 22 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయగలిగాడు. 2014 సంవత్సరంలో, శివమ్‌ను ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ .10 లక్షలకు తీసుకుంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 2014 మే 9 న తొలి మ్యాచ్ ఆడాడు శివమ్. ఈ మ్యాచ్‌లో అతను రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు, కాని నాలుగు ఓవర్లలో 26 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో యువరాజ్ సింగ్, ఎల్బీ మోర్కెల్ వికెట్లు ఉన్నాయి.

Also Read:

దుమ్ములేపిన సెహ్వాగ్ మేనల్లుడు.. బౌండరీల వర్షం.. కానీ జట్టును గెలిపించలేకపోయాడు

యువకుడు చనిపోయాడని చెప్పిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు.. పోస్ట్‌మార్టం రూమ్‌కి తీసుకెళ్లగా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..