RR IPL 2023 Auction: రాయల్స్‌కు అతడిపైనే ఆసక్తి.. కానీ నో క్యాష్.. మరి బట్లర్‌కు బ్యాకప్ దొరికేనా.?

Rajasthan Royals IPL 2023 Auction: సంజూ శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ 2022లో ప్రత్యర్ధి జట్లకు..

RR IPL 2023 Auction: రాయల్స్‌కు అతడిపైనే ఆసక్తి.. కానీ నో క్యాష్.. మరి బట్లర్‌కు బ్యాకప్ దొరికేనా.?
Rajasthan Royals
Follow us

|

Updated on: Dec 22, 2022 | 9:33 PM

Rajasthan Royals IPL 2023 Auction: సంజూ శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ 2022లో ప్రత్యర్ధి జట్లకు గట్టి పోటీనిస్తూ రాయల్స్ చివరి వరకు నెగ్గుకొచ్చింది. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు తప్పితే.. ఈ టీంలో ఇంకేం లోపాలు లేవు. అందుకే ఫామ్ లేని ఆటగాళ్లను మినీ వేలానికి ముందు వదిలించుకున్న రాజస్థాన్.. ఈసారి అత్యుత్తమ ఫామ్ ఉన్న ప్లేయర్స్‌ను బ్యాకప్ ఆప్షన్స్‌గా పెట్టుకునేందుకు సిద్దమవుతోంది. సంగక్కర పర్యవేక్షణలో ఈ మినీ ఆక్షన్‌లో కీ ప్లేయర్స్‌ను కొనుగోలు చేసేందుకు రాజస్థాన్ రాయల్స్ ప్రణాళికలు సిద్దం చేసింది.

రాయల్స్ రిటైన్ ప్లేయర్స్ బ్రేక్‌డౌన్ ఇలా..

  • టాప్ ఆర్డర్ బ్యాటర్లు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్

  • ఫినిషర్స్: షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్

  • ఆల్‌రౌండర్లు: రవిచంద్రన్ అశ్విన్

  • స్పిన్నర్లు: యుజ్వేంద్ర చాహల్, కెసి కరియప్ప

  • ఫాస్ట్ బౌలర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బోల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్

  • *రిలీజ్ ప్లేయర్స్*: అనునాయ్ సింగ్, కర్బిన్ బాస్క్, మిచిల్, నీషమ్, కరుణ్ నాయర్, కోల్టర్‌నైల్, డుస్సెన్, గర్హ్వాల్, తేజస్ బరాక్

  • *మిగిలిన మొత్తం*: రూ 13.2 కోట్లు, *ఓవర్సీస్ స్లాట్స్* – 4, *మొత్తం స్లాట్స్* – 9

టార్గెట్ ప్లేయర్స్: కామెరాన్ గ్రీన్, జోష్ ఫిలిప్, ఫిల్ సాల్ట్, జాసన్ హోల్డర్, షకీబ్ అల్ హసన్, డారిల్ మిచెల్, డేవిడ్ వైస్, డేనియల్ సామ్స్, సికందర్ రాజా, దసున్ షనక, వేన్ పార్నెల్