Ravichandran Ashwin IPL 2022 Auction: అశ్విన్‌ను సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఎంతకు కొనుగోలు చేసిందంటే..

Ravichandran Ashwin IPL 2022 Auction: అశ్విన్‌ను సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఎంతకు కొనుగోలు చేసిందంటే..
Ashwin

Ravichandran Ashwin Auction Price: స్పిన్నర్ ఆర్. అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అతన్ని రూ. 5 కోట్లకు దక్కించుకుంది.

Srinivas Chekkilla

|

Feb 12, 2022 | 5:33 PM

Ravichandran Ashwin Auction Price: అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2022 వేలంలో రాజస్థాన్ ఐదు కోట్ల రూపాయలకు తీసుకుంది. అతని బేస్ ధర రూ.2 కోట్లు ఉండగా.. అశ్విన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ పోటీ పడ్డాయి. చివరికి రాయల్స్ అతన్ని దక్కించుకుంది. ఐపీఎల్‌లో అశ్విన్‌కి ఇది ఐదో జట్టు. ఇప్పటి వరకు అతను ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లకు ఆడాడు.

ఐపీఎల్ చివరి సీజన్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్నాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. IPL 2021 తర్వాత అశ్విన్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. 2010, 2011లో చెన్నై ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచినప్పుడు అశ్విన్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతన్ని 2018 IPL మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌తో చేరాడు. ఇక్కడ అతను రెండు సీజన్లకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కానీ జట్టును ప్లేఆఫ్‌కు చేర్చలేకపోయాడు.

ఐపీఎల్‌లో విజయవంతమైన ఆటగాళ్లలో ఆర్‌ అశ్విన్‌కు పేరుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 167 మ్యాచ్‌లు ఆడి 145 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 6.91 కాగా, అతని వికెట్ టేకింగ్ సగటు 27.80. అశ్విన్ పవర్‌ప్లేతో పాటు మిడిల్ అవర్స్‌లో కూడా బౌలింగ్ చేయగలడు. తొలినాళ్లలో చెన్నై తరఫున మంచి ప్రదర్శన చేసిన తర్వాతే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Read Also.. IPL 2022 Auction: కోహ్లీ టీంలోకి ధోని స్నేహితుడు.. తగ్గేదేలే అంటూ కాసులు కురిపించిన ఆర్సీబీ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu