5 మ్యాచ్‌లు.. 571 పరుగులు.. 2 సెంచరీలు.. ధోని దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ ప్లేయర్ ఎవరో తెలుసా?

ఈ ప్లేయర్ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడి 4 సంవత్సరాలు గడుస్తోంది. చివరిసారిగా 2019లో భారత్‌పై ఆడాడు. సీన్ కట్ చేస్తే..

5 మ్యాచ్‌లు.. 571 పరుగులు.. 2 సెంచరీలు.. ధోని దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ ప్లేయర్ ఎవరో తెలుసా?
Peter Handscomb
Follow us

|

Updated on: Dec 06, 2022 | 5:40 PM

ఈ ప్లేయర్ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడి 4 సంవత్సరాలు గడుస్తోంది. చివరిసారిగా 2019లో భారత్‌పై ఆడాడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి టీమిండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌తోనే రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ధోని దగ్గర ఇతడు నేర్చుకున్న వికెట్ కీపర్ పాఠాలు బాగా కలిసొచ్చాయి. అటు వికెట్ కీపర్‌గా.. ఇటు బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. పాకిస్తాన్‌పై తొలి సెంచరీ నమోదు చేసుకున్న ఈ ఆటగాడు.. భారత్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టు పరువు నిలబెట్టాడు. ప్రస్తుతం డొమెస్టిక్ టోర్నమెంట్‌లో అదరగొడుతున్న ఇతడు.. రాబోయే ఇండియా సిరీస్‌కు టెస్టు జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నాడు. అతడి గణాంకాలు కూడా ఇవే చెబుతున్నాయి. ఇక అతడెవరో కాదు ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ పీటర్ హ్యాండ్‌కాంబ్.

పీటర్ హ్యాండ్‌కాంబ్ మళ్లీ ఆస్ట్రేలియా జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ 31 ఏళ్ల బ్యాటర్ షెఫీల్డ్ షీల్డ్‌ ట్రోఫీలో 93.66 సగటుతో 571 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అలాగే గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తరపున ఆడిన హ్యాండ్‌కాంబ్.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే, ఈ ప్రదర్శనతో జట్టులోకి ఈజీగా తిరిగి వచ్చే అవకాశం దక్కదని భావించిన హ్యాండ్‌కాంబ్.. డొమెస్టిక్ క్రికెట్‌లో నిరంతరం రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత్‌తో జరిగే సిరీస్‌పై ఆశలు పెట్టుకున్నాడు.

ఫిబ్రవరి-మార్చిలో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన..

హ్యాండ్స్‌కాంబ్ స్పిన్‌ను బాగా ఎదుర్కోగలడు. దీనికి భారత పర్యటనకు ఎంపిక కాబోయే జట్టులో చోటు కోసం ట్రావిస్ హెడ్‌తో పోటీపడనున్నాడు. ఈ ఏడాది శ్రీలంక, పాకిస్థాన్ పర్యటనల్లో ఆస్ట్రేలియా జట్టులో హెడ్ భాగమయ్యాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!