NZ vs ENG: 62 ఏళ్ల రికార్డ్‌కు బీటలు.. వారి దెబ్బకు హిస్టరీ రిపీట్.. అవేంటంటే?

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 130, ఓవర్టన్ 89 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

NZ vs ENG: 62 ఏళ్ల రికార్డ్‌కు బీటలు.. వారి దెబ్బకు హిస్టరీ రిపీట్.. అవేంటంటే?
New Zealand Vs England Test Jamie Overton, Jonny Bairstow
Follow us

|

Updated on: Jun 25, 2022 | 3:58 PM

జానీ బెయిర్‌స్టో సెంచరీ, జామీ ఓవర్‌టన్‌తో నెలకొల్పిన రికార్డు భాగస్వామ్యం నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజున ఇంగ్లండ్ బలమైన పునరాగమనం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 329 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి, కష్టాల్లో కూరుకపోయింది. ఇక్కడ నుంచి బెయిర్‌స్టో, ఓవర్టన్ ఏడో వికెట్‌కు అజేయంగా 209 పరుగుల భాగస్వామ్యంతో జట్టును తిరిగి పుంజుకునేలా చేశారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 130, ఓవర్టన్ 89 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీయగా, నైల్ వెజెనర్ రెండు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.

62 ఏళ్ల రికార్డ్‌కు బ్రేకులు..

బెయిర్‌స్టో, ఓవర్టన్‌లు టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌ తరపున ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ జిమ్ పార్క్, మైక్ స్మిత్‌ల 62 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. 1960లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్క్, స్మిత్ ఏడో వికెట్‌కు 197 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

24వ ఇంగ్లిష్ బ్యాటర్‌గా..

సెంచరీ ఇన్నింగ్స్ సాయంతో 5000 టెస్టు పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో టెస్టులో 5 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌ నుంచి ఈ ఘనత సాధించిన 24వ ఆటగాడిగా నిలిచాడు.

92 ఏళ్ల తర్వాత సర్ బ్రాడ్‌మన్ ఫీట్ పునరావృతం..

92 ఏళ్ల తర్వాత సర్ బ్రాడ్‌మన్ ఫీట్‌ను మిచెల్ పునరావృతం చేశాడు. మ్యాచ్ మూడో రోజు న్యూజిలాండ్ తరపున డారిల్ మిచెల్ (109) సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లిష్ పిచ్‌లపై వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీతో ఈ ఘనత సాధించిన తొలి విజిటర్ బ్యాటర్‌గా నిలిచాడు. 1930లో సర్ డాన్ బ్రాండ్‌మన్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో తన స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్రాండ్‌మన్ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు.

మిచెల్ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. టామ్ బ్లండెల్ (55) కెరీర్‌లో ఆరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతడి వికెట్‌ను పాట్స్‌ పడగొట్టాడు.

ఐదు వికెట్లు పడగొట్టిన లీచ్..

ఇంగ్లండ్ తరపున లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ 3 వికెట్లు, మాథ్యూ పాట్స్, జామీ ఓవర్టన్ తలో ఒక వికెట్ పడగొట్టారు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??