IND vs AUS: టీ20, వన్టేల్లో అగ్రస్థానం.. టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఆస్ట్రేలియానే.. సిరీస్ గెలిస్తే రోహిత్ సేనదే లక్కీ ఛాన్స్..

Team India: భారత జట్టు ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఫలితం టీమిండియాను టెస్టుల్లో నంబర్-1గా నిలబెట్టమే కాకుండా, డబ్ల్యూటీసీ ఫైనల్ చేర్చనుంది.

IND vs AUS: టీ20, వన్టేల్లో అగ్రస్థానం.. టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఆస్ట్రేలియానే.. సిరీస్ గెలిస్తే రోహిత్ సేనదే లక్కీ ఛాన్స్..
Team India
Follow us

|

Updated on: Jan 25, 2023 | 3:26 PM

గత కొంత కాలంగా వైట్ బాల్ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ప్రస్తుత ICC ర్యాంకింగ్స్‌లో భారత్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే, టీ20 జట్టుగా నిలిచింది. వన్డేల్లో 114 రేటింగ్ పాయింట్లతో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. అదే సమయంలో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ 267 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానం చేరిన మారిన భారత్‌.. ఇప్పుడు టెస్టుల్లోనూ నంబర్‌వన్ ర్యాంక్ వచ్చే అవకాశం వచ్చింది. టెస్టుల్లో మొదటి ర్యాంక్ సాధించాలంటే భారత్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాను 4-0 తేడాతో ఓడిస్తేనే..

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో తదుపరి టెస్ట్ సిరీస్ ఆడనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు కంగారూ జట్టు వచ్చే నెలలో భారత్‌కు రానుంది. ఈ సిరీస్ రోహిత్ సేనకు రెండు కారణాల వల్ల ఎంతో కీలకంగా మారింది. మొదటి కారణం, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించడానికి భారత్ ఈ సిరీస్‌ను మెరుగైన మార్జిన్‌తో గెలవాల్సి ఉంటుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలంటే ఆస్ట్రేలియాను 2-0 లేదా 3-1తో ఓడించాలి. రెండో కారణం, టెస్టు ర్యాంక్‌లో భారత్ నంబర్ వన్‌కు చేరుకోవాలంటే, స్వదేశంలో జరిగే సిరీస్‌లో ఆస్ట్రేలియాను 4-0తో వైట్‌వాష్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం టీమిండియా టెస్ట్ ర్యాంక్ ఎలా ఉందంటే?

ఐసీసీ ప్రస్తుత టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. టీమిండియా 115 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా కంటే 11 పాయింట్లు వెనుకంజలో నిలిచింది. కంగారూ జట్టు 126 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఓవరాల్‌గా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌ ఉత్కంఠభరితంగా సాగనుంది. గత 14 ఏళ్లుగా భారత గడ్డపై కంగారూ జట్టు ఒక్క టెస్టు కూడా గెలవలేకపోయింది. అదే సమయంలో గత 52 ఏళ్లలో, భారత గడ్డపై ఒక్కసారి మాత్రమే టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడంలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఫిబ్రవరి 9 నుంచి ఇరు దేశాల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!