ఆసీస్‌కు భారీ షాక్..!

వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. సెమీస్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్‌తో తలబడబోతున్న ఆసీస్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఖవాజా చేతికి గాయం అయింది. గాయం తీవ్రం కావడంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఖవాజా స్వదేశానికి పయనమయ్యాడు. ఇకపోతే ఖవాజా స్థానంలో మాథ్యూ వేడ్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అటు ఆల్‌రౌండర్ స్టోయినిస్‌కు కూడా […]

ఆసీస్‌కు భారీ షాక్..!
Follow us

|

Updated on: Jul 08, 2019 | 1:03 AM

వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. సెమీస్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్‌తో తలబడబోతున్న ఆసీస్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఖవాజా చేతికి గాయం అయింది. గాయం తీవ్రం కావడంతో విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఖవాజా స్వదేశానికి పయనమయ్యాడు.

ఇకపోతే ఖవాజా స్థానంలో మాథ్యూ వేడ్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అటు ఆల్‌రౌండర్ స్టోయినిస్‌కు కూడా గాయం కావడంతో మిచెల్ మార్ష్‌ను రీప్లేస్‌మెంట్ కింద ఎంపిక చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఓడిన ఆస్ట్రేలియాకు ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి.