టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోని

విశాఖ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు విశాఖ సిద్ధమైంది. మూడు సార్లు కప్ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌, యువ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ పోరులో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ధోనీ ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో చెన్నై ఒక్కే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మురళీ విజయ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించారు. ఎటువంటి మార్పులు లేకుండానే ఢిల్లీ జట్టు బరిలోకి దిగుతోంది.  ఈ మ్యాచ్‌ […]

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోని
Follow us

|

Updated on: May 10, 2019 | 7:37 PM

విశాఖ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు విశాఖ సిద్ధమైంది. మూడు సార్లు కప్ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌, యువ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ పోరులో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ధోనీ ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో చెన్నై ఒక్కే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మురళీ విజయ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించారు. ఎటువంటి మార్పులు లేకుండానే ఢిల్లీ జట్టు బరిలోకి దిగుతోంది.  ఈ మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌ చేరుకోవాలని శ్రేయస్‌ అయ్యర్ సేన పట్టుదలతో ఉంది.