నిమిషాల్లోనే ఐపీఎల్‌ ఫైనల్ టిక్కెట్లు హాంఫట్‌!

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 7 మ్యాచ్‌లకు ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యమివ్వగా.. ప్రతి పోరులోనూ అభిమానుల సంఖ్య 30 వేల పైచిలుకే. 38 వేల సామర్థ్యమున్న స్టేడియం కొన్ని మ్యాచ్‌లకు పూర్తిగా నిండిపోయింది. ఈనేపథ్యంలో ఐపీఎల్‌-12 ఫైనల్‌ టిక్కెట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల టిక్కెట్లు అందుబాటులో పెట్టిన ఐపీఎల్‌ నిర్వాహకులు.. ఫైనల్‌ మ్యాచ్‌ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయలేదు. చివరికి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈవెంట్స్‌నౌ.కామ్‌ సంస్థ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం […]

నిమిషాల్లోనే ఐపీఎల్‌ ఫైనల్ టిక్కెట్లు హాంఫట్‌!
Follow us

| Edited By:

Updated on: May 08, 2019 | 3:44 PM

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 7 మ్యాచ్‌లకు ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యమివ్వగా.. ప్రతి పోరులోనూ అభిమానుల సంఖ్య 30 వేల పైచిలుకే. 38 వేల సామర్థ్యమున్న స్టేడియం కొన్ని మ్యాచ్‌లకు పూర్తిగా నిండిపోయింది. ఈనేపథ్యంలో ఐపీఎల్‌-12 ఫైనల్‌ టిక్కెట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల టిక్కెట్లు అందుబాటులో పెట్టిన ఐపీఎల్‌ నిర్వాహకులు.. ఫైనల్‌ మ్యాచ్‌ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయలేదు. చివరికి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈవెంట్స్‌నౌ.కామ్‌ సంస్థ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించింది.

ఒకరోజు ముందో.. కనీసం కొన్ని గంటల ముందో పత్రికలు, టీవీ ఛానెళ్లకు కూడా కనీస సమాచారం అందించలేదు. గుట్టుచప్పుడు కాకుండా టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టిన ఈవెంట్స్‌నౌ.కామ్‌ వెబ్‌సైట్‌ కొన్ని నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైనట్లు చూపించింది. ఐతే ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు? ఎన్ని అమ్ముడయ్యాయి? ఏ టిక్కెట్లు ఎవరు కొన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు! ఈ విషయంపై ఈవెంట్స్‌నౌ ప్రతినిధి సుధీర్‌ను.. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సీఈఓ పాండురంగ మూర్తిలను సంప్రదించగా… వీరిద్దరు అందుబాటులోకి రాలేదు.