Vaibhav Suryavanshi : ట్రయల్స్‌లో 3 బంతుల్లో 3 సిక్సర్లు.. వైభవ్ సూర్యవంశీ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరీ సమర్ ఖాద్రీ?

Vaibhav Suryavanshi : కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ, క్రిస్ గేల్ రికార్డులను సైతం బద్దలు కొట్టిన ఈ బిహార్ కుర్రాడిని వెలుగులోకి తెచ్చింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ. పాట్నాకు చెందిన 36 ఏళ్ల సమర్ ఖాద్రీ.. భారత దేశవాళీ క్రికెట్లో మంచి గుర్తింపు ఉన్న మాజీ లెగ్ స్పిన్నర్.

Vaibhav Suryavanshi : ట్రయల్స్‌లో 3 బంతుల్లో 3 సిక్సర్లు.. వైభవ్ సూర్యవంశీ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరీ సమర్ ఖాద్రీ?
Vaibhav Suryavanshi

Updated on: May 28, 2026 | 2:42 PM

Vaibhav Suryavanshi : గడిచిన ఏడాది కాలంలోనే కాకుండా ఐపీఎల్ 2026 సీజన్లోనూ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేస్తున్న సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ, క్రిస్ గేల్ రికార్డులను సైతం బద్దలు కొట్టిన ఈ బిహార్ కుర్రాడిని వెలుగులోకి తెచ్చింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ. అయితే, అసలు ఎవరికీ తెలియని ఈ అద్భుత వజ్రాన్ని మట్టిలో నుంచి వెలికితీసి, రాజస్థాన్ రాయల్స్ వైపు మళ్లించిన అసలు సిసలైన గాడ్ ఫాదర్ ఒకరు ఉన్నారు. ఆయనే బిహార్ మాజీ క్రికెటర్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ అఫీషియల్ టాలెంట్ స్కౌట్ అయిన సమర్ ఖాద్రీ.

ఎవరీ సమర్ ఖాద్రీ?

పాట్నాకు చెందిన 36 ఏళ్ల సమర్ ఖాద్రీ.. భారత దేశవాళీ క్రికెట్లో మంచి గుర్తింపు ఉన్న మాజీ లెగ్ స్పిన్నర్. ఆయన 2009 నుంచి 2021 వరకు జార్ఖండ్, బిహార్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 45 మ్యాచ్‌ల్లో ఏకంగా 157 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించారు. లిస్ట్-ఏ లో 19 వికెట్లు, టీ20ల్లో 14 వికెట్లు తీసిన రికార్డు ఆయనకుంది. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత గత 3, 4 ఏళ్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అధికారిక టాలెంట్ స్కౌట్‎గా పనిచేస్తున్నారు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో దాగున్న అద్భుతమైన టాలెంటెడ్ పర్సనాలిటీలను గుర్తించి ఐపీఎల్ స్థాయికి తీసుకురావడమే ఈయన ప్రధాన బాధ్యత.

సమర్ కంటిన పడ్డ 11 ఏళ్ల చిన్నోడు

ఒక ఇంటర్వ్యూలో సమర్ ఖాద్రీ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీని తాను ఎలా కనుగొన్నారో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వైభవ్‌కు కేవలం 11 లేదా 12 ఏళ్లు ఉన్నప్పుడే అతని గురించి లోకల్ సర్కిల్స్ ద్వారా సమర్ మొదటిసారి విన్నారు. ఒకరోజు పాట్నాలో జరిగిన స్థానిక మ్యాచ్‌లో వీరిద్దరూ ముఖాముఖి తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో చిన్న పిల్లవాడైన వైభవ్ ఏకంగా 50 బంతుల్లోనే సెంచరీ బాదడమే కాకుండా, సీనియర్ బౌలర్ అయిన సమర్ ఖాద్రీ ఓవర్లలో కూడా భారీగా పరుగులు రాబట్టాడు. దాంతో ఈ అబ్బాయిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉందని, ఇది కేవలం అదృష్టం కొద్దీ ఆడిన ఆట కాదని సమర్ గ్రహించారు.

ట్రయల్స్‌లో ఫస్ట్ 3 బంతుల్లో 3 సిక్సర్లు

త్వరలోనే వైభవ్‌కు బిహార్ రంజీ జట్టులో కూడా అవకాశం దక్కింది. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ జుబిన్ భరూచాతో మాట్లాడిన సమర్ ఖాద్రీ.. ఈ బిహార్ వండర్ కిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. సమర్ మాట నమ్మి రాజస్థాన్ మేనేజ్‌మెంట్ వైభవ్‌ను తమ అఫీషియల్ ట్రయల్స్‌కు ఆహ్వానించింది. ట్రయల్స్ నెట్స్‌లోకి అడుగుపెట్టిన వెంటనే వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్న మొదటి 3 బంతుల్లోనే వరుసగా 3 భారీ సిక్సర్లు బాది అక్కడ ఉన్న కోచ్‌లు, సెలెక్టర్ల మైండ్ బ్లాక్ చేశాడు. అతని హిట్టింగ్ పవర్‌కు ఫిదా అయిన రాజస్థాన్ రాయల్స్ వెంటనే అతన్ని ఐపీఎల్ వేలానికి సెలెక్ట్ చేసింది. ఆ తర్వాత జరిగిన కథ మొత్తం ఇప్పుడు ప్రపంచ క్రికెట్ చూస్తూనే ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us