Video: పాక్ ప్లేయర్ భారీ కుట్ర చేసినా.. టెస్ట్ క్రికెట్‌లో అరుదైన చరిత్ర సృష్టించిన భారత దిగ్గజం.. ఇచ్చిపడేశాడుగా..

Anil Kumble 10 Wickets Video: సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే ఫిబ్రవరి 7వ తేదీన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అంతకు ముందు క్రికెట్ చరిత్రలో ఒక్కసారి, 2021లో కూడా ఇదే జరిగింది. టీమ్ ఇండియా లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఢిల్లీలో ఆ ఘనతను సాధించాడు, అతని ముందు పాక్ బ్యాట్స్‌మెన్ అందరూ ఒక్కొక్కరుగా లొంగిపోయారు.

Video: పాక్ ప్లేయర్ భారీ కుట్ర చేసినా.. టెస్ట్ క్రికెట్‌లో అరుదైన చరిత్ర సృష్టించిన భారత దిగ్గజం.. ఇచ్చిపడేశాడుగా..
Anil Kumble 10 Wickets Vide
Follow us

|

Updated on: Feb 07, 2024 | 11:29 AM

Anil Kumble 10 Wickets in Innings: ప్రపంచ క్రికెట్, ముఖ్యంగా భారత క్రికెట్ చరిత్రలో ఫిబ్రవరి 7కి ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు ఒక్కసారి మాత్రమే ఇలాంటి అద్భుతం జరిగింది. ఆ రోజు పాక్ ఆటగాడి కుట్ర ఫలించి ఉంటే ఈ అద్భుతం జరిగేది కాదు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాక్ బ్యాట్స్‌మెన్‌లను ఒక్కోక్కరిని పెవిలియన్ చేర్చడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ చరిత్రకు సాక్షిగా నిలిచింది.

7 ఫిబ్రవరి 1999న, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఢిల్లీలో జరిగింది. చెన్నైలో ఘోర పరాజయం తర్వాత భారత జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో పునరాగమనం చేయడానికి టీమిండియాకు విజయం అవసరం. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. ధీటుగా పాక్ జట్టు 172 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కుంబ్లే అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగుల ఆధిక్యం సాధించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగుల భారీ స్కోరు చేసి పాకిస్థాన్‌కు 420 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది.

కుంబ్లే ముందు కుప్పుకూలిన పాకిస్థాన్ జట్టు..

మ్యాచ్ నాలుగో రోజు అంటే ఫిబ్రవరి 7న భారత్ రెండో ఇన్నింగ్స్ ముగియడంతో పాక్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. షాహిద్ అఫ్రిది, సయీద్ అన్వర్‌లు తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ వికెట్ కోసం తహతహలాడింది. ఆ తర్వాత కుంబ్లే మొదట ఆఫ్రిది వికెట్‌ పడగొట్టాడు. ఇక ఇక్కడి నుంచి వికెట్ల పర్వం మొదలైంది. కుంబ్లే మొత్తం 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టడం క్రికెట్ చరిత్రలో రెండోసారి మాత్రమే. కుంబ్లే కంటే చాలా ఏళ్ల క్రితం ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఈ ఘనత సాధించాడు. కుంబ్లే తర్వాత, 2021లో, న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌పై ఈ ఫీట్‌ను పునరావృతం చేశాడు.

వకార్ యూనస్ కుట్ర..

కుంబ్లే సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి కొన్ని సంవత్సరాల తర్వాత, పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ఒక సంచలనాత్మక ప్రకటన చేశాడు. ఇది అతని సహచర పేసర్ వకార్ యూనిస్ ‘స్పోర్ట్స్‌మెన్‌షిప్’ ప్రశ్నార్థకమైంది. ఆ మ్యాచ్‌లో పాక్‌ కెప్టెన్‌ అక్రమ్‌, యూనిస్‌ చివరి జోడీగా ఉన్నారు. యూనిస్ స్వయంగా రనౌట్ కావాలనుకున్నాడని, దీని వల్ల కుంబ్లే మొత్తం 10 వికెట్లు పడగొట్టలేకపోయాడని, తద్వారా అతను చరిత్ర సృష్టించలేడని వసీమ్ చెప్పుకొచ్చాడు. అయితే, వకార్ ఈ కుట్ర విజయవంతం కాలేదు. అతని కంటే ముందే వసీం కుంబ్లేకి బలి అయ్యాడు. వసీం వెల్లడించిన తర్వాత వకార్ సిగ్గుపడ్డాడు. కానీ, పాకిస్థాన్ లెజెండ్ ఈ ఆరోపణను ఖండించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!