IND vs BAN 2nd Test: టాస్ గెలిచి షాకిచ్చిన రోహిత్.. ఆ ఛాలెంజ్‌కు సిద్ధమంటూ సిగ్నల్..

India vs Bangladesh, 2nd Test: భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఎట్టకేలకు టాస్ పడింది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ జట్లు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. కాన్పూర్‌లో గురువారం రాత్రి వర్షం కురిసింది. దీంతో పిచ్ తడిగా ఉంది. అయితే, కొద్దిసేపటి క్రితం పిచ్‌ను పరిశీలించి అంపైర్లు ఈ మ్యాచ్‌లో టాస్ ఉదయం 10:00 గంటలకు, మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటికే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs BAN 2nd Test: టాస్ గెలిచి షాకిచ్చిన రోహిత్.. ఆ ఛాలెంజ్‌కు సిద్ధమంటూ సిగ్నల్..
Ind Vs Ban 2nd Test Toss
Follow us

|

Updated on: Sep 27, 2024 | 10:13 AM

India vs Bangladesh, 2nd Test: భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఎట్టకేలకు టాస్ పడింది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ జట్లు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. కాన్పూర్‌లో గురువారం రాత్రి వర్షం కురిసింది. దీంతో పిచ్ తడిగా ఉంది. అయితే, కొద్దిసేపటి క్రితం పిచ్‌ను పరిశీలించి అంపైర్లు ఈ మ్యాచ్‌లో టాస్ ఉదయం 10:00 గంటలకు, మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటికే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

గ్రీన్ పార్క్‌లో పేసర్ల కంటే స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇరు జట్లు ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం ఇవ్వవచ్చు. టెస్టు సిరీస్ తర్వాత 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

పిచ్ రిపోర్ట్..

గ్రీన్ పార్క్‌లోని నల్ల నేల పిచ్‌పై ఎక్కువ బౌన్స్ ఉండదు. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదిగా మారుతుంది. చెన్నైలోని రెడ్ క్లే పిచ్‌పై మంచి బౌన్స్ కనిపించింది. కానీ, ఇక్కడ అలా జరగదు.

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో 1952 నుంచి టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 23 టెస్టులు జరగ్గా, భారత్ 7 గెలిచి 3 ఓడిపోయింది. ఈ కాలంలో దాదాపు 57% అంటే 13 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2010 నుంచి, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు మాత్రమే ఇక్కడ ఆడింది. 2016లో భారత్ విజయం సాధించగా, 2021లో న్యూజిలాండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

వాతావరణ పరిస్థితులు..

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి మూడు రోజులకు వర్షం అంతరాయం కలిగించవచ్చు. ఆక్యూవెదర్ ప్రకారం, శుక్రవారం కాన్పూర్‌లో 93% వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఇక్కడ ఉష్ణోగ్రత 28 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

బంగ్లాదేశ్: నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..