Ind Vs Nz: సిరీస్ వైట్‌వాష్.. టీమిండియా ఓటమికి ఈ 5 తప్పులే కారణం..

భారత్ ఓటమికి భారీ కారణం వర్షం అని భావించినట్లయితే పొరపాటే.. వాస్తవానికి టీమిండియా ఓటమికి కారణం మొదటి మ్యాచ్‌లో చేసిన సొంత తప్పిదాలే.

Ind Vs Nz: సిరీస్ వైట్‌వాష్.. టీమిండియా ఓటమికి ఈ 5 తప్పులే కారణం..
India Vs New Zealand
Follow us

|

Updated on: Nov 30, 2022 | 6:11 PM

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 0-1తో కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిన భారత్.. ఆ తర్వాత మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారడంతో రెండూ రద్దయ్యాయి. రెండో వన్డేలో భారత్‌కు 12.5 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభించగా, మూడో వన్డేలో మొత్తం 47.3 ఓవర్లలో 219 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. భారత్ ఓటమికి భారీ కారణం వర్షం అని భావించినట్లయితే పొరపాటే.. వాస్తవానికి టీమిండియా ఓటమికి కారణం మొదటి మ్యాచ్‌లో చేసిన సొంత తప్పిదాలే. ఆ 5 తప్పిదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • వన్డే సిరీస్‌కు వర్షం అడ్డంకిగా మారుతుందని ముందే ఊహించారు. హామిల్టన్, క్రైస్ట్‌చర్చ్‌లలో వాతావరణం గురించి అందరికీ తెలుసు, కాబట్టి మొదటి మ్యాచ్‌లో విజయం సాధించడానికి టీమిండియా ప్రయత్నించాల్సింది. కానీ ఆ సమయంలో బౌలింగ్, ఫీల్డింగ్‌లలో భారత్ పూర్తిగా విఫలమైంది. వర్షం కారణంగా 2 మ్యాచ్‌లు రద్దైనప్పటికీ, ముందుగానే ఆధిక్యం సాధించి సిరీస్‌ను ఎలా గెలుచుకోవాలన్నది టీ20 సిరీస్ నుంచి భారత్ గుణపాఠం నేర్చుకోవాలి.
  • తొలి వన్డేలో భారత్ 306 పరుగులు చేసింది. కానీ ఏం లాభం. ఆ మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని చవి చూసింది. పాత బంతితో ఫాస్ట్ బౌలర్ల పేలవ ప్రదర్శనే దీనికి ప్రధాన కారణం. దాన్ని సద్వినియోగం చేసుకున్న టామ్ లాథమ్ అజేయ సెంచరీ సాధించాడు. మూడో వన్డేలోనూ అదే కనిపించింది. దీపక్ చాహర్, అర్ష్‌దీప్‌లు శుభారంభం అందించినా 5-6 ఓవర్ల తర్వాత ఆ ఇద్దరూ లైన్ అండ్ లెంగ్త్ పూర్తిగా కోల్పోయారు.
  • మొదటి మ్యాచ్‌లో, భారత్‌కు ఆరో బౌలర్ ఆప్షన్ కావాల్సి వచ్చింది. అందుకే రెండో మ్యాచ్‌లో ఈ పొరపాటును సరిదిద్దుకుని దీపక్ హుడాకు అవకాశం ఇచ్చి.. అతడి స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ని పక్కన పెట్టారు. అయితే, ఈ మార్పు వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం కలగలేదు, ఎందుకంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది.
  • న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ల తుఫాను ఇన్నింగ్స్‌లు కూడా భారత్ ఓటమికి అతిపెద్ద కారణం. తొలి మ్యాచ్‌లో టామ్ లాథమ్ అజేయంగా 145 పరుగులు చేశాడు. అతడికి తోడుగా కేన్ విలియమ్సన్ 94 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వన్డేలో కూడా ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వన్డేలోనూ కివీస్ బ్యాట్స్‌మెన్లు ధాటిగా ఆడటంతో భారత్ మ్యాచ్‌లో వెనుకబడింది.
  • రిషబ్ పంత్ కూడా భారత ఓటమికి కారణమే. అతడు బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మ్యాచ్ చేంజర్‌, హార్డ్ హిట్టింగ్ బ్యాటర్‌గా పంత్ ఎన్నో ఇన్నింగ్స్‌లలో చాలాసార్లు నిరూపించాడు. అయితే కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో 15 పరుగులు మాత్రమే చేయగలిగిన అతడు మూడో వన్డేలోనూ 10 పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్‌ బ్యాటర్లు జట్టును ఓటమి దిశగా పయణించేలా చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.