T20 Cricket Records: టీ20ల్లో టీమిండియా స్పెషల్ రికార్డ్.. రెండో స్థానానికి చేరిన ఆసీస్.. అదేంటంటే?

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాటు టీమిండియా ఈ ఫార్మాట్‌లో భారీ రికార్డులను తన పేరిట లిఖించుకుంది. భారత్‌తోపాటు భువనేశ్వర్ కూడా ఓ స్పెషల్ లిస్టులో చేరాడు.

T20 Cricket Records: టీ20ల్లో టీమిండియా స్పెషల్ రికార్డ్.. రెండో స్థానానికి చేరిన ఆసీస్.. అదేంటంటే?
Ind Vs Ire Records
Follow us

|

Updated on: Jun 27, 2022 | 6:32 PM

ఐర్లాండ్‌(IND vs IRE)తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) తొలిసారిగా భారత్‌కు కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌తో ఘనంగా ఆరంభించాడు. దీంతో కెప్టెన్సీ కెరీర్ కూడా విజయంతో మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో జట్టు మంచి ప్రదర్శనతో పాటు హార్దిక్ సొంత ప్రదర్శన కూడా మెరుగ్గా ఉంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తన పేరిట ఓ భారీ రికార్డు సృష్టించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విజయం సాధించి కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు లక్ష్యాన్ని ఛేదించిన అంతర్జాతీయ జట్టుగా భారత్ నిలిచింది.

ఈ విషయంలో ఆస్ట్రేలియాను భారత్ అధిగమించింది. ఇప్పటి వరకు లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 55 సార్లు విజయం సాధించగా, ఆస్ట్రేలియా 54 సార్లు విజయం సాధించింది.

టీ20 క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన టీంలు..

ఇవి కూడా చదవండి
  1. • భారత్ – మొత్తం మ్యాచ్‌లు 75, గెలిచింది – 55, ఓడిపోయింది – 19
  2. • ఆస్ట్రేలియా – మొత్తం మ్యాచ్‌లు 94, గెలిచింది – 54, ఓడిపోయింది – 37
  3. • పాకిస్థాన్ – మొత్తం మ్యాచ్‌లు 86, గెలిచింది – 53, ఓడిపోయింది – 31
  4. • ఇంగ్లండ్ – మొత్తం మ్యాచ్‌లు 82, గెలిచింది – 42, ఓడిపోయింది – 37
  5. • దక్షిణాఫ్రికా – మొత్తం మ్యాచ్ 64, విజయం- 37, ఓడిపోయింది – 26

ఇదే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన వ్యక్తిగత స్థాయిలో కూడా ఓ భారీ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లేలో భువనేశ్వర్ కుమార్ 34 వికెట్లు, వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్ బద్రీ 33 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు (T20 ఇంటర్నేషనల్) తీసిన బౌలర్లు..

  1. • భువనేశ్వర్ కుమార్ – 35
  2. • శామ్యూల్ బద్రీ – 33
  3. • టిమ్ సౌతీ – 33
  4. • షకీబ్ అల్ హసన్ – 27
  5. • జోష్ హాజిల్‌వుడ్ – 26

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..