IND vs ENG: ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..! కీలక ప్లేయర్లకు గాయాలు.. టీంలోకి వచ్చేది ఎవరంటే..?

ఓవల్ టెస్టులో టీమిండియా విజయంతోపాటు షాక్ కూడా తగిలింది. కీలక ఆటగాళ్లు గాయలాపలవ్వడంతో భారత శిభిరంలో కాస్త ఆందోళన మొదలైంది. దీంతో టీంలోకి ఎవరు రానున్నారో ఓసారి చూద్దాం..!

IND vs ENG: ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..! కీలక ప్లేయర్లకు గాయాలు.. టీంలోకి వచ్చేది ఎవరంటే..?
Teamindia

IND vs ENG: ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్‌లో 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. దీంతో ఐదు టెస్ట్‌ల సిరీస్ 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక సెప్టెంబర్ 10 నుంచి మొదలుకానున్న చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరు జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది. అయితే ఓవల్ టెస్టులో టీమిండియా విజయంతోపాటు షాక్ కూడా తగిలింది. కీలక ఆటగాళ్లు గాయలాపలవ్వడంతో భారత శిభిరంలో కాస్త ఆందోళన మొదలైంది. దీంతో టీంలోకి ఎవరు రానున్నారో ఓసారి చూద్దాం..!

హిట్ మ్యాన్ రోహిత్, పుజారా డౌటేనా..?
చివరి టెస్ట్‌కు భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో తొలి సెంచరీ సాధించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐదో టెస్టుకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓవల్ టెస్ట్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయాలపాలయ్యాడు. దాదాపు 353 నిమిషాలపాటు క్రీజులోనే ఉండిపోయాడు. దీంతో రోహిత్ శర్మ తొడలు ఎర్రగా కమిలిపొయాయంట. అలాగే ఇంగ్లండ్ బౌలర్ల బంతులు గట్టిగా తాకడంతో రెండు తొడలకు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వీటి తీవ్రతపై ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. కానీ, నాలుగో టెస్టులో చివరి రెండు రోజులు రోహిత్ ఫీల్డింగ్‌కు దిగలేదు. ముందస్తు చర్యల్లో భాగంగా హిట్ మ్యాన్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గాయాలు తీవ్రమైతే రోహిత్ ఆఖరి టెస్ట్‌కు దూరం అవుతా. అదే జరిగితే పృథ్వీ షా/మయాంక్ అగర్వాల్‌లో ఒకరు జట్టులోకి వస్తారు. అలాగే టీమిండియా నయావాల్ పుజారా కూడా నాలుగో టెస్టులో గాయపడ్డాడు. రోహిత్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పుజారా.. వికెట్ల మధ్య పరుగులు తీసేప్పుడు మడమలు మడతపడి నొప్పితో విలవిల్లాడిపోయాడు. పుజారా కూడా చివరి రెండు రోజులు ఫీల్డింగ్ చేయలేదు. గాయం తీవ్రమైతే చివరి టెస్టులో పుజారా కూడా ఆడకపోవచ్చు.

రహానే కు నో ఛాన్స్..
ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న రహానేపై వేటు పడనుంది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 107 పరుగులు చేశాడు. లార్డ్స్ టెస్ట్‌లో హాఫ్ సెంచరీ మినహా.. అనుకున్నంతగా రాణించలేదు. దీంతో రహానేను తొలగించి, వేరొకరి ఛాన్స్ ఇవ్వాలంటూ మాజీ క్రికెటర్లు కూడా సూచిస్తున్నారు. చివరి టెస్టులో కోహ్లీ ఏంచేస్తాడో చూడాలి. రహానే ప్లేస్‌లో హనుమ విహారీ లేదా సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరికి అవకాశం దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోసారి అశ్విన్‌‌కు నిరాశే..
పుజారా కనుక చివరి టెస్టులో ఆడకుంటే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగవచ్చు. సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేస్తే 4వ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. రహానే పై వేటు పడితే.. అతని స్థానంలో హనుమ విహారి 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. ఈ వరుసలో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌లతో లోయర్ ఆర్డర్ బలంగా తయారైంది. చివరి టెస్టులో కూడా రవిచంద్రన్ అశ్విన్‌కు నిరాశ తప్పేలా ఉంది. మాంచెస్టర్ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తోనే చివరి టెస్టులో బరిలోకి దిగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చివరి టెస్టులో అశ్విన్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం జడేజాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.

సిరాజ్‌కు విశ్రాంతి..
గాయం కారణంగా మహమ్మద్ షమీ గాయం నుంచి కోలుకంటే మాత్రం సిరాజ్‌కు విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే సిరాజ్‌నే బరిలో నిలుచునే అవకాశం ఉంది. అయితే పేస్ దళంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్‌లతోనే ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

టీమిండియా తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ/పృథ్వీషా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా/సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), అజింక్యా రహానే/హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా/అశ్విన్, సిరాజ్/మహమ్మద్ షమీ

Also Read: IND vs ENG: ఓవల్ విజయం తరువాత డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో తెలుసా..? అన్‌సీన్ విజువల్స్ అంటూ వీడియో విడుదల చేసిన బీసీసీఐ

Neeraj Chopra: నీరజ్‌ను చెత్త ప్రశ్నలతో విసిగిస్తోన్న నిర్వాహకులు.. నవ్వుతూ తిరస్కరించిన గోల్డెన్ బాయ్

Virat kohli-Ravi Shastri: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్తి, కెప్టెన్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం.. ఎందుకో తెలుసా?

Click on your DTH Provider to Add TV9 Telugu