Womens Asia Cup 2022: నేటి నుంచి మహిళల ఆసియాకప్‌ .. లంకేయులతో టీమిండియా తొలి పోరు

బంగ్లాదేశ్‌ వేదికగా శనివారం (అక్టోబర్‌ 1) నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఇవాళ జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో  తలపడనుంది.

Womens Asia Cup 2022: నేటి నుంచి మహిళల ఆసియాకప్‌ .. లంకేయులతో టీమిండియా తొలి పోరు
Team India
Follow us

|

Updated on: Oct 01, 2022 | 8:25 AM

కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ క్లీన్‌స్వీప్‌తో విజయోత్సాహంలో ఉన్న మహిళల క్రికెట్‌ జట్టు మరో మెగా సమరానికి సిద్ధమైంది. బంగ్లాదేశ్‌ వేదికగా శనివారం (అక్టోబర్‌ 1) నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఇవాళ జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో  తలపడనుంది. ఆ తర్వాత వరుసగా మలేషియా (అక్టోబర్‌3), యూఏఈ(అక్టోబర్‌ 4), పాకిస్తాన్‌ ( అక్టోబర్‌7), బంగ్లాదేశ్‌ (అక్టోబర్‌ 8), థాయ్‌లాండ్‌ (అక్టోబర్‌ 10) జట్లతో తలపడనుంది.

ఆరుసార్లు ఛాంపియన్‌..

కాగా ఈ టోర్నీలో ఆతిథ్య బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మలేషియా, యూఏఈలతో సహా మొత్తం 7 జట్లు పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో అన్ని జట్లు మొత్తం ఆరేసి మ్యాచ్‌ లు ఆడనున్నాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్ల మధ్య అక్టోబర్ 15న టైటిల్ పోరు జరగనుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ జరగనుంది. ఆసియా కప్‌ చరిత్రలో వన్డేలు, టీ20లు కలిపి మొత్తం 32 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 30 మ్యాచ్‌లు గెలిచింది. ఆరుసార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. దీన్ని బట్టే చెప్పొచ్చు ఆసియా కప్‌లో భారత్‌ రికార్డులు ఎలా ఉన్నాయో. అయితే 2018లో జరిగిన చివరి ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది.

ఇవి కూడా చదవండి

కాగా హర్మన్‌ప్రీత్, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన సూపర్‌ ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్‌ చేరికతో బ్యాటింగ్‌ మరింత పటిష్ఠంగా మారింది. అవసరమైతే హేమలత, కీపర్‌ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా మెరుగ్గానే రాణిస్తున్నారు. అయితే షెఫాలీ వైఫల్యం జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. ఇక బౌలింగ్‌లో రేణుకా సింగ్‌ ఠాకూర్‌ తన స్వింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. మరో పేసర్‌ పూజా వస్త్రకర్‌ కూడా నిలకడగా రాణిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా స్పిన్‌ విభాగంలో రాణిస్తున్నారు. వీరందరూ సమష్ఠిగా రాణిస్తే మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలవడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??