అగార్కర్, గంభీర్ మర్చిపోయారు.. కట్‌చేస్తే.. 174 పరుగులతో ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్

Karnataka vs Goa Match in Ranji Trophy: గతంలో టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడైన కరుణ్ నాయర్.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత నిలకడ లేమి కారణంగా భారత టెస్టు జట్టు నుంచి తప్పించారు. వెస్టిండీస్ సిరీస్‌కు, ఆ తర్వాత జరగబోయే సౌతాఫ్రికా 'ఏ' సిరీస్‌కు కూడా అతన్ని పరిగణలోకి తీసుకోలేదు.

అగార్కర్, గంభీర్ మర్చిపోయారు.. కట్‌చేస్తే.. 174 పరుగులతో ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్
Karun Nair

Updated on: Oct 26, 2025 | 8:26 PM

Team India: భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయి నిరాశలో ఉన్న కర్ణాటక సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్, రంజీ ట్రోఫీ 2025/26 సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సెలెక్టర్లకు, ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు గట్టి సమాధానం ఇచ్చాడు. గోవాతో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ ఒంటరి పోరాటం చేసి, ఏకంగా 174 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఒంటరి పోరాటం.. కర్ణాటకకు ఆసరా..

శివమొగ్గలోని కేఎస్‌సీఏ నవూలే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కర్ణాటక కష్టాల్లో ఉన్నప్పుడు కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన నాయర్, జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. చివరి వరకూ నిలబడి, అద్భుతమైన సంయమనాన్ని, పట్టుదలను ప్రదర్శించాడు. అతను 267 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 174 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అతని ఇన్నింగ్స్ సహాయంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్‌కు శ్రేయస్ గోపాల్ (57) మాత్రమే చెప్పుకోదగిన సహకారం అందించాడు.

సెలెక్టర్లకు గట్టి జవాబు..

గతంలో టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడైన కరుణ్ నాయర్.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత నిలకడ లేమి కారణంగా భారత టెస్టు జట్టు నుంచి తప్పించారు. వెస్టిండీస్ సిరీస్‌కు, ఆ తర్వాత జరగబోయే సౌతాఫ్రికా ‘ఏ’ సిరీస్‌కు కూడా అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల మాట్లాడుతూ, “మేం కరుణ్ నాయర్ నుంచి మరింతగా ఆశించాం. ఒక్క ఇన్నింగ్స్ గురించి మాత్రమే ఇది కాదు. దేవ్దత్ పడిక్కల్ మాకు మరిన్ని అవకాశాలను ఇస్తున్నాడు,” అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

అయితే, తన బ్యాట్‌తోనే మాట్లాడాలని నిర్ణయించుకున్న కరుణ్ నాయర్.. ఈ అద్భుతమైన 174 నాటౌట్ ఇన్నింగ్స్‌తో, తానూ ఇంకా పూర్తి కాలేదనే స్పష్టమైన సందేశాన్ని సెలెక్టర్లకు పంపాడు. ఈ ఇన్నింగ్స్ అతనికి 25వ ఫస్ట్-క్లాస్ సెంచరీ కావడం విశేషం.

భవిష్యత్తుపై ఆశలు..

33 ఏళ్ల కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతని సగటు దాదాపు 49కి చేరువలో ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలనే తన కలను కరుణ్ నాయర్ ఇంకా వదులుకోలేదని, ఈ భారీ సెంచరీ ద్వారా నిరూపించాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, రంజీ ట్రోఫీలో నాయర్ ఈ రకమైన ‘డాడీ హండ్రెడ్స్’ ఆడటం కొనసాగిస్తే, సెలెక్టర్లు అతన్ని విస్మరించడం కష్టం. కరుణ్ నాయర్ ఈ అద్భుత ప్రదర్శన.. భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడానికి మరోసారి తన వాదనను బలంగా వినిపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..