Ravindra Jadeja: తగ్గేదేలే.. మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చిన జడేజా.. విండీస్‌ను ఆల్‌రౌండర్‌ను దాటి..

ICC Test Rankings:టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మళ్లీ మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో 175 పరుగులతో పాటు. తొమ్మిది వికెట్లు తీసిన జడేజా ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.

Ravindra Jadeja: తగ్గేదేలే.. మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చిన జడేజా.. విండీస్‌ను ఆల్‌రౌండర్‌ను దాటి..
Jadeja
Follow us

|

Updated on: Mar 24, 2022 | 7:15 AM

ICC Test Rankings:టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మళ్లీ మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో 175 పరుగులతో పాటు. తొమ్మిది వికెట్లు తీసిన జడేజా ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. అయితే వారం రోజులు కూడా గడవకముందే టాప్‌ ప్లేస్‌ను కోల్పోయాడు. ఇంగ్లండ్- వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో జేసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. అయితే తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌ (ICC Test Rankings)లో మళ్లీ టాప్‌ ప్లేసులోకి దూసుకొచ్చాడు జడ్డూ. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో జడేజా, హోల్డర్‌కు మధ్య దాదాపు 28 పాయింట్ల వ్యత్యాసం ఉంది. మరో రెండు నెలల పాటు ఎలాంటి టెస్టు సిరీస్‌లు లేకపోవడంతో జడేజా కొన్నాళ్ల పాటు అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది.

దిగజారిన రోహిత్‌ ప్లేస్‌.. కాగా ఈ జాబితాలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(341 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో మార్నస్‌ లబుషేన్‌, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్ విలియమ్సన్‌ మొదటి స్థానాల్లో నిలిచారు. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ టాప్‌-5లో చోటు దక్కించుకున్నాడు. మరో పాక్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ కూడా వార్నర్‌తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం దిగజారి 754 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. విరాట్‌ కోహ్లి తొమ్మిది, రిషబ్‌ పంత్‌ పదో స్థానంలో ఉన్నారు. వన్డే ర్యాంకింగ్స్‌లో.. బ్యాటింగ్‌ విభాగంలో పాక్‌ ఆటగాడు బాబర్, విరాట్ కోహ్లీ వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు.

Also Read:Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..

Covid-19 4th Wave: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్‌ అలజడి.. అప్రమత్తమైన రాష్ట్రాలు.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Storing Bananas: అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోతున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?