పకోడీలు కావాలంటూ.. పాక్ క్రికెటర్‌ను ఆటపట్టించిన అభిమానులు!

క్రికెట్ గ్రౌండ్‌లో ఆటగాళ్లను అభిమానులు ఆటపట్టించడం మాములు విషయమే. అయితే కొన్నిసార్లు అవి హద్దులు దాటతాయి. ఇక సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి ప్రపంచకప్‌లో జరిగింది. మే 31వ తేదీన వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అందులో పాకిస్థాన్ చిత్తుగా ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ ఫఖార్ జమాన్‌ను కొంతమంది టీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో ఫఖార్ […]

పకోడీలు కావాలంటూ.. పాక్ క్రికెటర్‌ను ఆటపట్టించిన అభిమానులు!
Ravi Kiran

|

Jun 03, 2019 | 9:36 AM

క్రికెట్ గ్రౌండ్‌లో ఆటగాళ్లను అభిమానులు ఆటపట్టించడం మాములు విషయమే. అయితే కొన్నిసార్లు అవి హద్దులు దాటతాయి. ఇక సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి ప్రపంచకప్‌లో జరిగింది. మే 31వ తేదీన వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అందులో పాకిస్థాన్ చిత్తుగా ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ ఫఖార్ జమాన్‌ను కొంతమంది టీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో ఫఖార్ ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని అతన్ని పకోడీ తీసుకురమన్నాడు. ”ఫఖార్ భాయ్.. ఇరవై రూపాయల పకోడీ తీసుకురా” అంటూ అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 21.4 ఓవర్లలో 105 పరుగులు చేయగా.. విండీస్ 13.4 ఓవర్లలో 108 పరుగులు చేసి విజయం సాధించింది.

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu