
Hasan Ali catch PSL 2026: లాహోర్ ఖలందర్స్ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య జరిగిన ఈ పోరు క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. షాహీన్ అఫ్రిది నాయకత్వంలోని లాహోర్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా, కరాచీ బౌలర్లు ఆది నుంచే పట్టు బిగించారు. అయితే, ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో అసలైన మలుపు చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన తక్కువ ఎత్తు బంతిని అబ్దుల్లా షఫీక్ భారీ షాట్ ఆడబోయి గాల్లోకి లేపాడు. లాంగ్-ఆన్ నుంచి పరుగు పరుగున వచ్చిన హసన్ అలీ, గాలిలో అద్భుతంగా డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు.
క్యాచ్ అందుకున్న వెంటనే హసన్ అలీ చేసిన సంబరాలు అందరినీ ఆకర్షించాయి. మైదానం వైపు వేలు చూపిస్తూ “ఇది నా అడ్డా” (దిస్ ఈజ్ మై యార్డ్) అనే సంకేతాన్ని పంపాడు. సాధారణంగా హసన్ అలీని ఒక సగటు ఫీల్డర్‌గా మాత్రమే చూస్తారు, కానీ ఈ అద్భుత క్యాచ్‌తో తనపై ఉన్న విమర్శలకు అతను గట్టి సమాధానం చెప్పాడు. ముఖ్యంగా 2021 ప్రపంచకప్‌లో మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి విమర్శల పాలైన హసన్, ఇప్పుడు అదే స్థాయిలో మెరిసి తన సత్తా చాటాడు.
Adam Zampa takes his second wicket in HBL PSL 🔥
Brilliant catch by Hasan Ali to dismiss Abdullah Shafique 👏 pic.twitter.com/Z0HhbKyG74
— 𝑨𝒎𝒊𝒓 (@Khanu_3) March 29, 2026
షఫీక్ వికెట్ పడే సమయానికి లాహోర్ జట్టు మెరుగైన స్థితిలో ఉంది. అతను 33 పరుగులతో క్రీజులో పాతుకుపోయి భారీ స్కోరు వైపు సాగుతున్నాడు. కానీ హసన్ అలీ పట్టిన ఆ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. 56 పరుగులకు 2 వికెట్లుగా ఉన్న లాహోర్ స్కోరు, షఫీక్ అవుట్ అయిన తర్వాత ఒక్కసారిగా తడబడింది. వరుస వికెట్లు కోల్పోయి 115 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కరాచీ బౌలర్లు సమిష్టిగా రాణించి లాహోర్ బ్యాటర్లను కట్టిడి చేశారు.
పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో హసన్ అలీ ఫీల్డింగ్‌పై ఎప్పుడూ ఒక రకమైన అసంతృప్తి ఉండేది. గతంలో కీలక మ్యాచ్‌లలో క్యాచ్‌లు వదిలేయడం వల్ల అతను సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే, ఆదివారం సాయంత్రం డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని కరాచీ జట్టు కోసం అతను చూపిన తెగువ, ఆ జట్టుకు విలువైన రెండు పాయింట్లను అందించడంలో కీలకంగా మారింది. ఈ క్యాచ్ కేవలం ఒక వికెట్ మాత్రమే కాదు, హసన్ అలీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించిన క్షణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..