Dwayne Bravo: క్రికెట్‌కు వెస్టిండిస్ దిగ్గజం వీడ్కోలు.. డ్వేన్ బ్రావో నెక్స్ట్ టాక్క్ అదే..!

| Edited By: Janardhan Veluru

Sep 27, 2024 | 12:58 PM

తాజాగా బ్రావో అన్ని ఫార్మట్లో రిటైర్‌‌మెంట్‌ను ప్రకటించాడు. ఇక నుంచి కొచింగ్‌పైన దృష్టి పెట్టబోతున్నట్ల వెల్లడించారు. సీపీఎల్ లీగ్‌లో గాయపడడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. CSK,అఫ్గానిస్థాన్ టిమ్‌లకు కోచ్‌గా కూడా చేశాడు. 2004లో ఇంటర్‌నెషనల్ క్రికెట్‌‌లో అడుగుపెట్టిన బ్రావో 66 T20లు, 40 టెస్టులు, 164 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

Dwayne Bravo: క్రికెట్‌కు వెస్టిండిస్ దిగ్గజం వీడ్కోలు.. డ్వేన్ బ్రావో నెక్స్ట్ టాక్క్ అదే..!
1
Follow us on

వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ డ్వేన్ బ్రావో క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ ఆల్‌రౌండర్ ఇంటర్నెషనల్‌  క్రికెట్‌కు గుడ్ బై చేప్పిన విషయం తెలిసిందే. తాజాగా బ్రావో అన్ని ఫార్మట్లో రిటైర్‌‌మెంట్‌ను ప్రకటించాడు. ఇక నుంచి కొచింగ్‌పైన దృష్టి పెట్టబోతున్నట్ల వెల్లడించారు. సీపీఎల్ లీగ్‌లో గాయపడడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో CSK, అఫ్గానిస్థాన్ టిమ్‌లకు కోచ్‌గా కూడా చేశాడు. 2004లో ఇంటర్నెషనల్‌ క్రికెట్‌‌లో అడుగుపెట్టిన బ్రావో 66 T20లు, 40 టెస్టులు, 164 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్‌లో క్రీస్ గేల్ తర్వాత అంత విధ్వంసకర క్రికెటర్ బ్రావోనే అని చెప్పవచ్చు. ఇప్పటికే సినియర్ ప్లేయర్లు వీడ్కొలు పలకడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విండీస్‌కు బ్రావో రిటైర్‌మెంట్ నిరాశే అని చెప్పాలి.

త్వరలో 41 ఏండ్లలోకి అడుగుపెడుతున్న బ్రావో క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. 2021లో ఇంటర్నెషనల్‌ క్రికెట్‌కు రిటైర్‌‌మెంట్‌ ప్రకటించిన తర్వాత కొన్ని లీగ్ మ్యాచ్‌లో ఆడాడు. తనకు ఎంతో ఇచ్చిన క్రికెట్‌కు గుడ్‌ బాయ్ పలికే రోజు వచ్చేందని, 5 సంవత్సరాల నుంచి క్రికెటే ఊపిరిగా బతికినట్లు, వెస్టిండీస్ జట్టుకు ఆడడం ఒక్క లక్ అయితే, లీగ్‌ మ్యాచ్‌లో పాల్గొనడం సరదాగా ఉన్నట్లు చెప్పారు. ఇక నుంచి కొత్త బాధ్యతలో రాణించడానికి ప్రయత్నం చేయబోతున్నట్లు చెప్పారు. తను క్రికెటర్‌గా మారడానికి భాగస్వాములైన వారందీరికి థాంక్స్ చెప్పితే సరిపోదన్నారు. అత్యుత్తమ క్రీడాకారుడిగా ఎదగాడికి భాగస్వాములు ఆయన వారికీ తను సాధించిన విజయాలన్ని అంకితం ఇస్తున్నట్లు చెప్పారు.

కాగా బ్రావో రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. ఆయన తమ మెంటర్‌గా పనిచేయనున్నట్లు కొల్‌కత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్) ప్రకటించింది. గౌతమ్ గంబీర్ టీమిండియా హెడ్ కోచ్‌లా వెళ్లడంతో ఆయన స్థానంలో బ్రావోకు అవకాశమిచ్చింది కేకేఆర్ యాజమాన్యం.

రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో..