IND vs ENG: ఓవల్ విజయం తరువాత డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో తెలుసా..? అన్‌సీన్ విజువల్స్ అంటూ వీడియో విడుదల చేసిన బీసీసీఐ

IND vs ENG: ఇంగ్లండ్‌తో సోమవారం ముగిసిన 4 వ టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

IND vs ENG: ఓవల్ విజయం తరువాత డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో తెలుసా..?  అన్‌సీన్ విజువల్స్ అంటూ వీడియో విడుదల చేసిన బీసీసీఐ
Teamindia

IND vs ENG: ఇంగ్లండ్‌తో సోమవారం ముగిసిన 4 వ టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత, ఆతిథ్య జట్టుపై భారత్ 157 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి, 50 సంవత్సరాల తర్వాత ఓవల్ మైదానంలో తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో కోహ్లీసేనలో ఆత్మ విశ్వాసం మరింత మెరుగైంది. సిరీస్‌లో చివరిదైన టెస్టు సెప్టెంబర్ 10 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది. అయితే, ఓవల్ విజయం తరువాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ట్విట్టర్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో టీమిండియా ఆటగాళ్లు వేడుకలతోపాటు వారి మాటలతో ఓ వీడియోను పంచుకుంది.

” ఓవల్‌లో టీమిండియా అద్భుత విజయం తరువాత.. డ్రెస్సింగ్ రూమ్‌లో మీకు కనిపించని విజువల్స్, రియాక్షన్‌లను అందిస్తున్నాం” అంటూ బీసీసీఐ రాసుకొచ్చింది. “వికెట్ ఫ్లాట్ అని మాకు తెలుసు. కాబట్టి మేము 5 వ రోజు చాలా శ్రమించాల్సి వచ్చింది. వికెట్లు వస్తాయని తెలుసు. మేము పరుగులు నియంత్రించేందుకు ప్రయత్నించాం” అని ఉమేష్ యాదవ్ వీడియోలో తెలిపారు. గతేడాది డిసెంబర్ తర్వాత ఉమేశ్ యాదవ్ తన మొదటి టెస్టు ఓవల్‌లో ఆడాడు. ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా నిలిచాడు.

అలాగే ఆటలో కీలకంగా మారిన మరో ఆటగాడు శార్దూల్ ఠాకూర్. శార్దూల్ రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 36 బంతుల్లో 57 పరుగుల వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. దీంతోనే టీమిండియా అత్యల్ప స్కోర్‌కు ఆలౌట్ అయ్యే ప్రమాదాన్నుంచి తప్పించుకుంది. అలాగే రెండవ ఇన్నింగ్స్‌లో 72 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. ఇక బంతితో 3 వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 1 వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు. దీంతో శార్దూల్ టెస్ట్ క్రికెట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఓవల్ టెస్టులో శార్దూల్ ఆల్ రౌండ్ గేమ్ కనిపించింది.

చివరి రోజు భారత్ విజయానికి 10 వికెట్లు అవసరం అయ్యాయి. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీన శార్దుల్.. భారత వికెట్ల ఖాతాను తెరిచాడు. అలాగే మూడు మ్యాచ్‌లలో మూడు సెంచరీలతో చెలరేగిన జో రూట్ వికెట్‌ను కూడా పడగొట్టి భారత విజయాన్ని ఖాయం చేశాడు.

“ఇది గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఓవల్‌లో కీలకంగా మారినందుకు ఎంతో సంతోషంతో ఉన్నాను. బ్యాట్‌తోపాటు బాల్‌తోను ఆకట్టుకోవడం ఎంతో ప్రత్యేకం. ఏదైనా సరే జట్టుకు విజయానికి అవసరమైనందుకు గర్వపడుతున్నాను” అని ఠాకూర్ వీడియోలో పేర్కొన్నాడు.

Also Read: 3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు.. 4 టెస్టులతో కెరీర్ క్లోజ్.. ఈ టీమిండియా ప్లేయర్ ఎవరంటే.?

Neeraj Chopra: నీరజ్‌ను చెత్త ప్రశ్నలతో విసిగిస్తోన్న నిర్వాహకులు.. నవ్వుతూ తిరస్కరించిన గోల్డెన్ బాయ్

Virat kohli-Ravi Shastri: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్తి, కెప్టెన్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం.. ఎందుకో తెలుసా?

Click on your DTH Provider to Add TV9 Telugu