DC VS PBKS Live Score IPL 2021: చేల‌రేగిన శిఖ‌ర్ ధావ‌న్‌… ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ… ఆరు వికెట్ల తేడాతో…

| Edited By: Team Veegam

Updated on: May 19, 2021 | 2:29 PM

DC VS PBKS Live Score IPL 2021: ఐపీఎల్ 2021 టోర్నీలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మ్యాచ్‌కు రంగం సిద్ధ‌మైంది. ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రుగుతోన్న...

DC VS PBKS Live Score IPL 2021: చేల‌రేగిన శిఖ‌ర్ ధావ‌న్‌... ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ... ఆరు వికెట్ల తేడాతో...
Dc Vs Pbks

DC VS PBKS Live Score IPL 2021: పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. 6 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో రెండో విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 196 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ 18.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది. శిఖ‌ర్ ధావ‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి కేవ‌లం 49 బంతుల్లో 92 ప‌రుగులు సాధించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు:

రిషభ్‌ పంత్ (కెప్టెన్‌)‌, మాయంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌, స్టీవ్‌స్మిత్‌, మార్కస్‌ స్టాయినిస్‌, లలిత్‌ యాదవ్‌, క్రిస్‌ వోక్స్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, కాగిసో రబాడ, అవేశ్‌ ఖాన్‌, లక్మన్‌ మెరివాల.

పంజాబ్‌ కింగ్స్ జ‌ట్టు..

కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌),మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, దీపక్‌ హుడా, పూరన్‌, షారుక్‌ ఖాన్‌,జే రిచర్డ్‌సన్‌,జలజ్‌ సక్సేనా,మహ్మద్‌ షమి,రిలీ మెరిడీత్‌,అర్ష్‌దీప్‌ సింగ్‌.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Apr 2021 11:16 PM (IST)

    ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించిన ఢిల్లీ… టోర్నీలో రెండో విజయం..

    పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గ్రాండ్ విక్ట‌రీని సొంతం చేసుకుంది. శిఖ‌ర్ ధావ‌న్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించ‌డంతో పంజాబ్ ఉంచిన భారీ స్కోర్‌ను ఢిల్లీ చేధించింది.

  • 18 Apr 2021 11:08 PM (IST)

    మ‌రో వికెట్ కోల్పోయిన ఢిల్లీ… వెనుదిరిగిన రిష‌భ్ పంత్‌..

    మ్యాచ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్న‌కొద్ది ఉత్కంఠ‌త పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. రిచ‌ర్డ్ స‌న్ వేసిన బంతికి హుడా అద్భుత క్యాచ్‌తో రిషబ్ పంత్‌ను అవుట్ చేశాడు.

  • 18 Apr 2021 10:53 PM (IST)

    కీల‌క వికెట్ కోల్పోయిన ఢిల్లీ... సెంచ‌రీ మిస్ చేసుకున్న ధావ‌న్‌..

    జ‌ట్టు స్కోరును పెంచుతూ దూసుకెళుతోన్న స‌మయంలోనే శిఖ‌ర్ ధావ‌న్ వెనుదిరిగాడు. కేవ‌లం 49 బంతుల్లోనే 92 ప‌రుగులు సాధించిన ధావ‌న్ కొంత‌లో సెంచ‌రీ మిస్ అయ్యాడు. రిచ‌ర్డ్‌స‌న్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

  • 18 Apr 2021 10:42 PM (IST)

    దంచి కొడుతోన్న శిఖ‌ర్ ధావ‌న్‌.. 47 బంతుల్లో 91 ప‌రుగులు..

    శిఖ‌ర్ ధావ‌న్ దంచి కొడుతున్నాడు. జ‌ట్టు స్కోరును పెంచే క్ర‌మంలో వేగంగా ఆడుతోన్న ధావ‌న్ కేవ‌లం 47 బంతుల్లో 91 ప‌రుగులు సాధించాడు.

  • 18 Apr 2021 10:28 PM (IST)

    మ‌రో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. మంచి పాట్న‌ర్‌షిప్‌కు బ్రేక్‌..

    ఢిల్లీ జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. 49 ప‌రుగుల‌తో ధావ‌న్‌తో క‌లిసి మంచి పాట్న‌ర్‌షిప్ అందించిన స్మిత్ వెనుదిరిగాడు. రిలీ మెరిడీత్ వేసిన బంతికి షాట్‌కు ప్ర‌య‌త్నించిన రిచ‌ర్డ్‌స‌న్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

  • 18 Apr 2021 10:21 PM (IST)

    హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న ధావ‌న్‌.. ఢిల్లీ స్కోర్ 100...

    పంజాబ్ ఇచ్చిన భారీ ల‌క్ష్యాన్ని చేధించే ప‌నిలో ప‌డ్డ ఢిల్లీ ఆ దిశ‌లో ప‌య‌ణిస్తోంది. ఈ క్ర‌మంలోనే శిఖ‌ర్ ధావ‌న్ హాప్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఢిల్లీ 10.1 ఓవ‌ర్ల‌కు 100 స్కోరు చేసింది.

  • 18 Apr 2021 09:58 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. వెనుదిరిగిన పృథ్వీ షా..

    ఢిల్లీ జ‌ట్టుకు మంచి భాగ‌స్వామ్యం అందిస్తున్నార‌ని అనుకుంటోన్న స‌మ‌యంలోనే పృథ్వీ షా అవుట్ అయ్యాడు. అర్ష్‌దీప్ వేసిన బంతికి భారీ షాట్ ఆడబోయిన పృథ్వీ షా.. గేల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

  • 18 Apr 2021 09:53 PM (IST)

    50 పరుగులు పూర్తి చేసుకున్న ఢిల్లీ..

    పంజాబ్ జ‌ట్టు ఏ విధంగా అయితే మంచి ఓపెనింగ్ అందించిందో ఢిల్లీ కూడా అది దారిలో వెళుతోంది. ఢిల్లీ ఓపెన‌ర్స్ పృథ్వీ 31 ప‌రగులు శిఖ‌ర్ దావ‌న్ 26 ప‌రుగుల‌తో మంచి భాగ‌స్వామ్యాన్ని అందించారు. ఈ క్ర‌మంలో జ‌ట్టు స్కోరు 50 ప‌రుగులు దాటింది.

  • 18 Apr 2021 09:29 PM (IST)

    భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ.. ఓపెనింగ్ చాలా ముఖ్యం..

    పంజాబ్ ఇచ్చిన భారీ ల‌క్ష్యంతో ఢిల్లీ బ‌రిలోకి దిగింది. పృథ్వీ షా, శిశఖ‌ర్ ధావ‌న్ భారీ ల‌క్ష్య చేధ‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ స్కోరు చేధించాలంటే క‌చ్చితంగా మంచి ఓపెనింగ్ ఉండాలి. మ‌రి చూడాలి ఢిల్లీ ఏమేర రాణిస్తుందో.

  • 18 Apr 2021 09:24 PM (IST)

    ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్‌… ఢిల్లీ ల‌క్ష్యం 196 ప‌రుగులు..

    టాస్ ఓడి బ్యాటింగ్ మొద‌లు పెట్టిన పంజాబ్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది. కేఎ రాహుల్‌, అగ‌ర్వాల్ మంచి ఓపెనింగ్ ఇవ్వ‌డంతో జ‌ట్టు స్కోరు ప‌రిగెత్తింది. ఇక ఢిల్లీ ఈ మ్యాచ్ గెల‌వాలంటే 120 బంతుల్లో 196 ప‌రుగులు చేయాల్సి ఉంది.

  • 18 Apr 2021 09:00 PM (IST)

    స్వ‌ల్ప స్కోరుకే వెనుదిరిగిన క్రిస్ గేల్..

    మెరుపులు మెరిపిస్తాడ‌ని ఆశించిన క్రిస్ గేల్ నిరాశ‌ప‌రిచాడు. 11 ప‌రుగుల స్వ‌ల్ప వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద వోక్స్ బౌలింగ్‌లో రిపాల్ ప‌టేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులోకి పూరన్ వ‌చ్చాడు. మ‌రి దీప‌క్ హుడాతో జోడి క‌ట్టిన పూర‌న్ జ‌ట్టు స్కోరును ఏ మేర ప‌రుగులెత్తిస్తారో చూడాలి.

  • 18 Apr 2021 08:52 PM (IST)

    భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించి అవుట్ అయిన రాహుల్‌..

    51బంతుల్లో 61 ప‌రుగులు సాధించి జ‌ట్టు స్కోరును ప‌రుగులెత్తించిన రాహుల్‌... అదే ఆట తీరును ప్ర‌ద‌ర్శించే క్ర‌మంలో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. ర‌బడా బౌలింగ్‌లో మార్కస్‌ స్టాయినిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ బాట పట్టాడు.

  • 18 Apr 2021 08:38 PM (IST)

    హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్..

    జ‌ట్టు స్కోరును పెంచే క్ర‌మంలో కేఎల్ రాహుల్ త‌న హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం క్రీజులో రాహుల్ 50 ప‌రుగులు, గేల్ 3 ప‌రుగుల‌తో కొన‌సాగుతున్నారు.

  • 18 Apr 2021 08:34 PM (IST)

    భారీ పాట్న‌న‌ర్ షిప్‌కు బ్రేక్‌.. అగ‌ర్వాల్‌ అవుట్‌..

    పంజాబ్‌కు మంచి ఓపెనింగ్ ఇచ్చి దాదాపు 10 ర‌న్ రేట్‌తో స్కోర్‌ను మెయింటెన్ చేస్తోన్న రాహుల్‌, అగ‌ర్వాల్ జోడిని లక్మన్‌ మెరివాల విడ‌తీశాడు. 36 బంతుల్లో 69 ప‌రుగులు చేసి జ‌ట్టు స్కోర్‌ను పెంచిన అగ‌ర్వాల్‌ ద‌వాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

  • 18 Apr 2021 08:33 PM (IST)

    అగ‌ర్వాల్‌కు తోడైన రాహుల్.. ఒక్క ఓవ‌ర్‌లో మూడు సిక్స్‌లు..

    పంజాబ్ స్కోరును ప‌రుగులు పెట్టించే ప‌నిలో ప‌డ్డ అగ‌ర్వాల్‌కు రాహుల్‌కు తోడ‌య్యాడు. 10వ ఓవ‌ర్‌లో ఏకంగా మూడు సిక్స్‌లు బాదాడు. ప్ర‌స్తుతం రాహుల్ 42 ప‌రుగుల‌తో, అగ‌ర్వాల్ 66 ప‌రుగుల‌తో కొన‌సాగుతున్నారు.

  • 18 Apr 2021 08:20 PM (IST)

    స్థిరంగా కొన‌సాగుతోన్న పంజాబ్ జ‌ట్టు స్కోరు.. ప‌ది ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి..

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ దూకుడుగా ఆడుతోంది. ప‌ది ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌మ‌యానికి ఒక్క వికెట్ కోల్పోకుండా 97 ప‌రుగులు సాధించింది ప్ర‌స్తుతం పంజాబ్ 10.2 బంతుల వ‌ద్ద 106 ప‌రుగుల వ‌ద్ద కొన‌సాగుతోంది.

  • 18 Apr 2021 07:56 PM (IST)

    దూకుడు మీదున్న అగ‌ర్వాల్‌.. 13 బంతుల్లోనే 30 ప‌రుగులు..

    మయాంక్‌ అగర్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. స్టేడియం చుట్టూ షాట్స్ కొడుతూ జ‌ట్టు స్కోరును పెంచుతున్నాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 13 బంతుల్లోనే 30 ప‌రుగులు సాధించాడు.

  • 18 Apr 2021 07:50 PM (IST)

    దూకుడుగా ఆడుతోన్న పంజాబ్ ఓపెన‌ర్స్‌..

    టాస్ ఓడి బ్యాటింగ్ మొద‌లు పెట్టిన పంజాబ్ టీమ్ మొద‌టి నుంచి దూకుడుగా ఆడుతోంది. ఓపెన‌ర్లు తొలి బంతి నుంచి బ్యాటుకు ప‌ని చెప్తున్నారు. పంజాబ్ నాలుగు ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి ఒక్క వికెట్ కోల్పోకుండా ఏకంగా 43 ప‌రుగులు చేసింది. పంజాబ్‌కు ఓపెన‌ర్లు మంచి ఆరంభం ఇచ్చార‌ని చెప్ప‌వ‌చ్చు.

Published On - Apr 18,2021 11:38 PM

Follow us