మీ ప్రేమకు ఐస్ అయ్యా.. వార్నర్ ఎమోషనల్ పోస్ట్!

వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అత్యవసర విజయాన్ని అందించి.. తన సొంత దేశానికి తిరుగు పయనమైయ్యాడు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. ఇక వెళ్తూ.. వెళ్తూ హైదరాబాదీలకు, సన్‌రైజర్స్‌ అభిమానులకు భావోద్వేగ సందేశాన్నిచ్చాడు. ప్రపంచకప్ జట్టు సన్నాహకంలో భాగంగా స్వదేశానికి పయనమైన వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగ పోస్టుతో అభిమానులకు వీడ్కోలు పలికాడు. ‘మీరు చూపిన ప్రేమకు, మద్దతుకు ఏవిధంగా కృతజ్ఞతలు […]

మీ ప్రేమకు ఐస్ అయ్యా.. వార్నర్ ఎమోషనల్ పోస్ట్!
Follow us

|

Updated on: Apr 30, 2019 | 5:22 PM

వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అత్యవసర విజయాన్ని అందించి.. తన సొంత దేశానికి తిరుగు పయనమైయ్యాడు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. ఇక వెళ్తూ.. వెళ్తూ హైదరాబాదీలకు, సన్‌రైజర్స్‌ అభిమానులకు భావోద్వేగ సందేశాన్నిచ్చాడు. ప్రపంచకప్ జట్టు సన్నాహకంలో భాగంగా స్వదేశానికి పయనమైన వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగ పోస్టుతో అభిమానులకు వీడ్కోలు పలికాడు.

‘మీరు చూపిన ప్రేమకు, మద్దతుకు ఏవిధంగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఈ ఏడాదే కాదు.. గతేడాది నేను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులలో కూడా మీరు మద్దతుగా నిలిచారు. మళ్లీ జట్టులో చేరడానికి.. మీ దగ్గరకు రావడానికి ఎంతో ఎదురు చూశాను. ఫ్రాంచైజీ యాజమాన్యం, ఆటగాళ్లు, సోషల్‌ మీడియా మిత్రులు, అభిమానులు నా పునరాగమనానికి ఘనస్వాగతం పలికారు. మీతో ఆడడంలో గల ఆనందాన్ని నేను ఎంతో ఆస్వాదించాను. మిగిలిన టోర్నీలో జట్టుకు అన్నీ విజయాలే దక్కాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నాడు.

సోమవారం పంజాబ్‌తో ఆఖరి మ్యాచ్‌ ఆడిన వార్నర్‌ (81 56 బంతుల్లో; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 692 పరుగుల చేశాడు. అందులో 8 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకు టోర్నీలో టాప్ స్కోరర్ గా వార్నర్ నిలిచాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ 12 మ్యాచ్‌ల్లో 6 గెలిచి.. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ టీం ప్లేఆఫ్‌కి చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాలి. ఈ దశలో డేవిడ్ వార్నర్ స్వదేశానికి వెళ్లిపోవడం అటు సన్‌రైజర్స్‌ టీంకు.. ఇటు అభిమానులకు తీరని లోటనే చెప్పాలి. మరోవైపు జట్టు ఫైనల్ కి చేరితే.. రావాలని అభిమానులు వార్నర్ ను కోరుతున్నారు.