స్వదేశానికి డేవిడ్ వార్నర్!

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. మే తొలి వారంలోనే స్వదేశానికి వచ్చేయాలని తమ ఆటగాళ్లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్వదేశానికి పయనమయ్యాడు. తాజా సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లాడిన వార్నర్ 69.20 సగటుతో ఏకంగా 692 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 8 అర్ధశతకాలు కూడా ఉండటం వార్నర్ దూకుడికి నిదర్శనం. […]

స్వదేశానికి డేవిడ్ వార్నర్!

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. మే తొలి వారంలోనే స్వదేశానికి వచ్చేయాలని తమ ఆటగాళ్లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్వదేశానికి పయనమయ్యాడు.

తాజా సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లాడిన వార్నర్ 69.20 సగటుతో ఏకంగా 692 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 8 అర్ధశతకాలు కూడా ఉండటం వార్నర్ దూకుడికి నిదర్శనం. గత ఏడాది నిషేధం కారణంగా ఐపీఎల్‌కి దూరమైన వార్నర్.. ఈ ఏడాది హాఫ్ సెంచరీతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఈ ఓపెనర్ విధ్వంసం కొనసాగింది. ఎంతలా అంటే..? అతను చేసిన పరుగుల్లో సగానికి పైగా బౌండరీల (57 ఫోర్లు, 21 సిక్సర్లు) రూపంలోనే వచ్చాయి. తొలి మ్యాచ్‌లోనే కాదు.. సీజన్‌లో తాను ఆడిన ఆఖరి మ్యాచ్‌లోనూ వార్నర్ జట్టుని గెలిపించడం అతని బాధ్యతకి నిదర్శనం.

తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఇప్పటికే ఆరింట్లో గెలుపొంది 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టీమ్ ప్లేఆఫ్‌కి చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాలి.

Click on your DTH Provider to Add TV9 Telugu