CSK vs DC IPL 2021: చెన్నై, ఢిల్లీ సూపర్ ఫైట్.. అందరి చూపు ధోని వైపు.. బోణీ ఎవరు కొడతారో.!

Chennai Super Kings vs Delhi Capitals Predicted Playing XI: పొట్టి ఫార్మాట్ సందడి షూరూ అయింది. నిన్న చెన్నై వేదికగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు...

  • Ravi Kiran
  • Publish Date - 11:45 am, Sat, 10 April 21
CSK vs DC IPL 2021: చెన్నై, ఢిల్లీ సూపర్ ఫైట్.. అందరి చూపు ధోని వైపు.. బోణీ ఎవరు కొడతారో.!
Csk Vs Dc

CSK vs DC IPL 2021: పొట్టి ఫార్మాట్ సందడి షూరూ అయింది. నిన్న చెన్నై వేదికగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచింది. ఇక ఈరోజు రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. రెండు జట్లూ కూడా విజయంతో టోర్నీలో శుభారంభం చేయాలని చూస్తున్నాయి. ఒకవైపు సీనియర్ కెప్టెన్ ధోని కాగా.. మరోవైపు యువ ప్లేయర్ రిషబ్ పంత్ మొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరులో ఇరు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం. ఢిల్లీ, చెన్నై బ్యాటింగ్ లైనప్ ఒకసారి పరిశీలిస్తే.. చెన్నైకి ఓపెనింగ్ జోడీ పెద్ద సమస్యగా మారితే.. ఢిల్లీకి బౌలింగ్ ప్రధాన సమస్య. రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ రోజు మ్యాచ్‌లో నలుగురు కీలక ఆటగాళ్లు ఆడట్లేదని సమాచారం. ఢిల్లీ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కరోనా సోకగా.. పేసర్లు రబాడా, నోర్తజే క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక చెన్నై బౌలర్ ఎంగిడికి కూడా క్వారంటైన్ గడువు పూర్తి కాలేదు.

ఢిల్లీకి డెత్ ఓవర్ల సమస్య..

ఢిల్లీ పేస్ ద్వయం నోర్తెజా, రబాడా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో.. ఢిల్లీకి డెత్ ఓవర్లు ప్రధాన సమస్యగా మారింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు డెత్ ఓవర్ స్పెషలిస్టులు. అటు అక్షర్ పటేల్ కూడా లేకపోవడంతో స్పిన్ పరిస్థితి కూడా ఇదే తీరులో ఉంది.

సీఎస్కేకు ఓపెనింగ్ జోడీ పెద్ద ప్రాబ్లం..

సీఎస్కేకి ఓపెనింగ్ జోడీ పెద్ద ఇబ్బందిగా మారింది. గతేడాది ఫామ్ కొనసాగించిన రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓపెనర్ కావడం ఖాయంగా కనిపిస్తుండగా.. మరో ఓపెనర్‌గా డుప్లెసిస్, రాబిన్ ఉతప్ప, జగదీషన్‌లలో ఎవరు బరిలోకి దిగుతారో తెలియాల్సి ఉంది. అటు మిడిల్ ఆర్డర్ అయితే రైనా, అంబటి రాయుడు, ధోనిలతో బలంగా ఉంది.

పంత్ టీం ఓపెనింగ్ కాంబినేషన్ ఓకే…

ఢిల్లీకి పృథ్వీ షా, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. మిడిల్ ఆర్డర్‌లో పంత్, హెట్‌మీర్, స్టోయినిస్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. ఇక స్పిన్ బౌలింగ్‌లో అశ్విన్, మిశ్రా ఉండగా.. పేస్‌ను ఇషాంత్ శర్మ చూసుకుంటాడు.

చెన్నై సూపర్ కింగ్స్(అంచనా):

రితురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్, ఎంఎస్ ధోని, సామ్ కరణ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, కె.కె. గౌతమ్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్

ఢిల్లీ క్యాపిటల్స్(అంచనా):

పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మియర్, క్రిస్ వోక్స్, ఆర్.కె. అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా

Also Read:

Viral: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.

ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!

Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుద్దోడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!