IPL 2026 Auction: రూ. 43.4 కోట్లతో భారీ స్కెచ్.. ‘ఎల్లో ఆర్మీ’ టార్గెట్ ప్లేయర్స్ లిస్ట్ చూస్తే పరేషానే..

Chennai Super Kings: మొత్తం మీద, ఈ వేలంలో CSK తన కోల్పోయిన కోర్ గ్రూప్ స్థానాలను భర్తీ చేయడానికి, ముఖ్యంగా ఆల్‌రౌండర్లు, స్పిన్నర్ల కోసం తమ భారీ పర్స్‌ను ఉపయోగించనుంది. 'తలా' ధోని వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే డిసెంబర్ 16న అబుదాబిలో జరిగే మినీ-వేలం వరకు వేచి చూడాలి.

IPL 2026 Auction: రూ. 43.4 కోట్లతో భారీ స్కెచ్.. ఎల్లో ఆర్మీ టార్గెట్ ప్లేయర్స్ లిస్ట్ చూస్తే పరేషానే..
Csk Ipl 2026

Updated on: Dec 09, 2025 | 7:36 PM

Chennai Super Kings: ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌ కోసం భారీ మార్పులతో సిద్ధమవుతోంది. ముఖ్యంగా కీలక ఆటగాళ్లు జట్టును వీడటం, కొందరు రిటైర్ అవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో, మినీ-వేలంలో తమ జట్టును పటిష్టం చేసుకోవడానికి “ఎల్లో ఆర్మీ” ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.

భారీ మార్పులు: ట్రేడ్‌లు, రిలీజ్‌లు..

ట్రేడ్ డీల్: ఈ వేలానికి ముందు CSK తీసుకున్న అత్యంత సంచలనాత్మక నిర్ణయం.. లెజెండరీ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ స్టార్ సామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు (RR) పంపి, బదులుగా వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకురావడం.

కీలక విడుదలలు: గత సీజన్‌లో నిరాశపరిచిన రచిన్ రవీంద్ర, మతీష పతిరణ, డేవాన్ కాన్వే వంటి విదేశీ ఆటగాళ్లతో పాటు దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి వంటి భారత ఆటగాళ్లను కూడా CSK విడుదల చేసింది.

రిటెన్షన్: కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని (ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం), శివమ్ దూబే వంటి కోర్ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది.

వేలం పర్స్: ఈ మార్పుల కారణంగా CSK వద్ద వేలంలో ఖర్చు చేయడానికి రూ. 43.4 కోట్ల భారీ పర్స్ మిగిలి ఉంది.

CSK ప్రధాన లక్ష్యాలు..

జడేజా, సామ్ కరన్, అశ్విన్ (రిటైర్మెంట్) లేకపోవడం వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంపైనే చెన్నై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఒక విదేశీ ఓపెనర్, నాణ్యమైన స్పిన్నర్, పవర్-హిట్టింగ్ ఆల్‌రౌండర్ కోసం చూస్తోంది.

1. పవర్-హిట్టింగ్ ఆల్‌రౌండర్‌లు: సామ్ కరన్ స్థానంలో ఒక శక్తివంతమైన పేస్ ఆల్‌రౌండర్ కోసం CSK తీవ్రంగా ప్రయత్నించనుంది.

ఆండ్రీ రస్సెల్: సుదీర్ఘ కాలం KKR తరపున ఆడిన విండీస్ విధ్వంసక వీరుడు ఆండ్రీ రస్సెల్‌ను కొనుగోలు చేయడానికి CSK పక్కా ప్లాన్ వేసింది. లోయరార్డ్‌లో అతని విధ్వంసక బ్యాటింగ్, కీలకమైన ఓవర్లలో బౌలింగ్ వేయగల సామర్థ్యం CSKకి సరిగ్గా సరిపోతుంది.

కామెరూన్ గ్రీన్: రస్సెల్ దక్కకపోతే, ఆస్ట్రేలియా యువ సంచలనం కామెరూన్ గ్రీన్‌ను టార్గెట్ చేయవచ్చు.

2. నాణ్యమైన స్పిన్నర్లు: జడేజా, అశ్విన్ జట్టులో లేకపోవడంతో స్పిన్ విభాగంలో పటిష్టత చాలా అవసరం.

రవి బిష్ణోయ్ / రాహుల్ చాహర్: అఫ్గానిస్థాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌తో పాటు ఒక అనుభవజ్ఞుడైన భారత లెగ్ స్పిన్నర్ కోసం CSK చూస్తోంది. రవి బిష్ణోయ్ లేదా చెపాక్ పిచ్‌కు బాగా సరిపోయే రాహుల్ చాహర్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేయవచ్చు.

3. టాప్-ఆర్డర్ బ్యాటర్లు: సంజు శాంసన్ జట్టులోకి వచ్చినా, గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఒక విదేశీ ఓపెనర్ అవసరం.

గతంలో విడుదల చేసిన ప్లేయర్‌లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్‌లో ఆడితే, మరొక స్టార్ ఓపెనర్‌ను టార్గెట్ చేయవచ్చు.

రవిచంద్రన్ అశ్విన్ సలహా..

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా CSKకు కొందరు ఆటగాళ్ల పేర్లను సూచించారు.

నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్: మిడిలార్డర్‌ను బలోపేతం చేయడానికి నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్‌లను తీసుకోవాలని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నితీష్ రాణా స్క్వేర్ బౌండరీలను సులభంగా బాదగల సామర్థ్యం CSKకి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

మొత్తం మీద, ఈ వేలంలో CSK తన కోల్పోయిన కోర్ గ్రూప్ స్థానాలను భర్తీ చేయడానికి, ముఖ్యంగా ఆల్‌రౌండర్లు, స్పిన్నర్ల కోసం తమ భారీ పర్స్‌ను ఉపయోగించనుంది. ‘తలా’ ధోని వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే డిసెంబర్ 16న అబుదాబిలో జరిగే మినీ-వేలం వరకు వేచి చూడాలి.