క్వాలిఫయర్‌-2లో చెన్నై లక్ష్యం 148

ఐపీఎల్ ఫైనల్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తడబడింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ అనుభవం ముందు యువతరం తలవొంచింది. కీలకమైన రెండో క్వాలిఫయర్‌లో ధోనీసేన ముందు స్వల్ప లక్ష్యమే ఉంచింది. కేవలం 147 పరుగులే చేసింది. రిషభ్‌ పంత్‌ (38; 25 బంతుల్లో 2×4, 1×6) మినహా మరెవరూ రాణించలేదు. కొలిన్‌ మన్రో (27; 24 బంతుల్లో 4×4) కాస్త జోరు చూపించాడు. ఆది నుంచీ చెన్నై అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. క్రమం తప్పకుండా వికెట్లు […]

క్వాలిఫయర్‌-2లో చెన్నై లక్ష్యం 148
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 9:34 PM

ఐపీఎల్ ఫైనల్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తడబడింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ అనుభవం ముందు యువతరం తలవొంచింది. కీలకమైన రెండో క్వాలిఫయర్‌లో ధోనీసేన ముందు స్వల్ప లక్ష్యమే ఉంచింది. కేవలం 147 పరుగులే చేసింది. రిషభ్‌ పంత్‌ (38; 25 బంతుల్లో 2×4, 1×6) మినహా మరెవరూ రాణించలేదు. కొలిన్‌ మన్రో (27; 24 బంతుల్లో 4×4) కాస్త జోరు చూపించాడు.

ఆది నుంచీ చెన్నై అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. క్రమం తప్పకుండా వికెట్లు తీసింది. దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, డ్వేన్‌ బ్రావో, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయకుండా ధోనీ చాకచక్యంగా స్పిన్నర్లను ప్రయోగించాడు. వరుసగా వికెట్లు పడుతుండటంతో ఒత్తిడి లోనైన పంత్‌ ధాటిగా ఆడలేకపోయాడు. శిఖర్ ధావన్‌ (18), పృథ్వీషా (5), శ్రేయస్‌ అయ్యర్‌(13), అక్షర్‌పటేల్‌(3), రూథర్‌ఫర్డ్‌ (10) నిరాశపరిచారు. కాగా చివరి ఓవర్‌లో ఇషాంత్‌ (10; 3 బంతుల్లో 1×4, 1×6), ట్రెంట్‌ బౌల్ట్‌ (6; 3 బంతుల్లో 1×6) సిక్సర్లు బాదడంతో దిల్లీ 147/9 పరుగులకు పరిమితమైంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో 150 వికెట్లు తీసిన రికార్డును భజ్జీ సాధించాడు.