Video: ఎవర్రా మీరంతా.. లైవ్ మ్యాచ్‌లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న క్రికెటర్లు.. పిచ్ మధ్యలోనే బ్యాట్లతో బాదేసుకున్నారు

|

Sep 27, 2024 | 12:18 PM

MCC Weekdays Bash XIX Final: ప్రస్తుతం చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అన్ని మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. అయితే మరోవైపు లీగ్‌ మ్యాచ్‌లు కూడా జరగుతున్నాయి. ఈ క్రమంలో ఓ క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం పిచ్ మధ్యలో బ్యాటర్లు, బౌలర్లు రచ్చ రచ్చ చేశారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో అంతా షాక్ అయ్యారు. బ్యాట్స్‌మెన్స్, బౌలర్ల మధ్య క్రికెట్ కాస్తా.. కుస్తీ పోటీగా మారింది.

Video: ఎవర్రా మీరంతా.. లైవ్ మ్యాచ్‌లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న క్రికెటర్లు.. పిచ్ మధ్యలోనే బ్యాట్లతో బాదేసుకున్నారు
Mcc Weekdays Bash Xix Final Viral Video
Follow us on

MCC Weekdays Bash XIX Final: ప్రస్తుతం చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అన్ని మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. అయితే మరోవైపు లీగ్‌ మ్యాచ్‌లు కూడా జరగుతున్నాయి. ఈ క్రమంలో ఓ క్రికెట్ మ్యాచ్‌లో మాత్రం పిచ్ మధ్యలో బ్యాటర్లు, బౌలర్లు రచ్చ రచ్చ చేశారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో అంతా షాక్ అయ్యారు. బ్యాట్స్‌మెన్స్, బౌలర్ల మధ్య క్రికెట్ కాస్తా.. కుస్తీ పోటీగా మారింది. ఆ తర్వాత బాక్సింగ్ రింగ్‌గా మారింది. ఇద్దరు క్రికెటర్ల మధ్య పోరు తర్వాత, రెండు జట్లలోని మిగిలిన క్రికెటర్లు కూడా ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అవతలి జట్టులోని ఒక ఆటగాడు కూడా బ్యాట్ పైకెత్తి ప్రత్యర్థి క్రికెటర్‌ని కొట్టడం చూడొచ్చు. ఈ మొత్తం ఫైట్ MCC వీక్‌డేస్ బాష్ XIX ఫైనల్స్ పోరులో జరిగింది. అయితే, ఇద్దరు అంపైర్లు మాత్రం ప్రేక్షకుల పాత్ర పోషించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

MCC వీక్‌డేస్ బాష్ XIX ఫైనల్ మ్యాచ్‌లో ఏరోవిసా క్రికెట్ వర్సెస్ రబడన్ క్రికెట్ క్లబ్ తలపడతాయి. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోని 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 12.6 ఓవర్లో రబాడాన్ బ్యాట్స్‌మెన్ కాషీఫ్ మహ్మద్ ఎరోవిసా బౌలర్ నాసిర్ అలీకి ఎల్బీడబ్ల్యూ క్యాచ్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

అంపైర్ వేలు పైకెత్తడంతో, బ్యాటర్ డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి రావడానికి ప్రయత్నించాడు. అతను 5 బంతుల్లో 8 పరుగులతో మైదానాన్ని వీడాడు. కానీ ఆ సమయానికి బౌలర్ బ్యాటర్ ముందుకి వచ్చి సైగలు చేయడం ప్రారంభించాడు. నాసిర్ పెవిలియన్ వైపు వేలు చూపించి మైదానం వదిలి వెళ్ళమని సూచించాడు. దీంతో కాషిఫ్ బౌలర్ వైపు తిరిగాడు. ఇక ఇక్కడి నుంచి అసలు యుద్ధం మొదలైంది.

లైవ్ మ్యాచ్‌లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న క్రికెటర్లు..

ఈ క్రమంలో బౌలర్ నాసిర్ బ్యాటర్ కాషిఫ్‌ను చేతితో నెట్టడంతో కుస్తీ పోటీ ప్రారంభమైంది. బ్యాటర్, బౌలర్ పిచ్‌పైనే పడి కొట్టుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో మైదానంలో ఇతర ఫీల్డర్లు కూడా దగ్గరకు వచ్చారు. కొందరు పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నించగా మరికొందరు కుస్తీ పోటీలకు దిగారు.

నాన్ స్ట్రైకర్ బ్యాట్స్‌మెన్ కూడా సహచరుడు కాషిఫ్‌కు అండగా నిలిచాడు. అయితే, వీళ్లను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆపడం అంత సులభం కాలేదు. అయితే క్రికెట్ మైదానంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. ఇంతకు ముందు బంగ్లాదేశ్‌లోని సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో రెండు జట్ల మధ్య ఇలాంటి ఘర్షణ కనిపించింది. దీంతో నిర్వాహకులు టోర్నీని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..