Watch Videos: కఠిన క్వారంటైన్‌లో కసరత్తు.. జిమ్‌లో చెమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు..

WTC Final: కఠిన క్వారంటైన్‌లో కూడా టీమిండియా క్రికెటర్లు జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ సాదన చేసే అవకాశం లేకపోవడంతో గ్రాండ్ హయత్ హోటల్‌లో ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు.

Watch Videos: కఠిన క్వారంటైన్‌లో కసరత్తు.. జిమ్‌లో చెమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు..
Team India
Follow us

|

Updated on: May 26, 2021 | 4:19 PM

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC Final) ఫైనల్‌ కోసం రెండు జట్లు కసరత్తు మొదలు పెట్టాయి. ఇందులో న్యూజిలాండ్, టీమిండియా తలపడనున్నాయి. అయితే ఇంగ్లాండ్ చేరుకునే ముందు టీమిండియా సభ్యులు ఇక్కడే కసరత్తు మొదలు పెట్టారు. అయితే కఠిన క్వారంటైన్‌లో సమయంలో టీమిండియా ఆటగాళ్లు ఏం చేస్తున్నారో చూండండి అంటూ ఓ వీడియోను విడుదల చేసింది బీసీసీఐ.

కఠిన క్వారంటైన్‌లో కూడా టీమిండియా క్రికెటర్లు జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ సాదన చేసే అవకాశం లేకపోవడంతో గ్రాండ్ హయత్ హోటల్‌లో ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్నది. ఇప్పటికే కివీస్ జట్టు ఇంగ్లాండ్ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు ఇంగ్లాండ్ జట్టుతో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నది.

దీంతో ఆ జట్టుకు పూర్తి స్థాయి ప్రాక్టీస్ లభించనున్నది. కాగా, టీమిండియా మాత్రం ఇంకా ఇంగ్లాండ్ వెళ్లలేదు. ప్రస్తుతం మన ఆటగాళ్లు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో కఠినమైన క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌లో 10 రోజుల క్వారంటైన్‌ను మూడు రోజులకు కుదించడంతో టీమిండియా ముంబైలో కఠిన క్వారంటైన్‌కు వెళ్లక తప్పలేదు. ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలోనే ఉన్న హయత్ హోటల్‌లో క్రికెటర్లు అందరూ వారికి కేటాయించిన రూమ్స్‌లో ఉంటున్నారు. అయితే తమ హోటల్ నుంచి బయటకు రాకున్నా సరే.. అదే హోటల్‌లో తమ ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు. ప్రత్యేకంగా శానిటైజ్ చేసిన జిమ్‌లో బరువులు ఎత్తుతూ ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు.

టీమ్ ఇండియా క్రికెటర్లు బయటకు వెళ్లి సాధన చేసే అవకాశం లేకపోవడంతో జిమ్‌లో ఫిట్ నెస్ పెంచుకుంటున్నారు. ‘ఇంగ్లాండ్ వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు ప్లేయర్స్ అందరూ ఇప్పటికే కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ప్రభుత్వం కూడా 18 ఏళ్ల పైబడిన వాళ్లందరికీ వాక్సిన్ కోసం అనుమతి ఇచ్చింది. దీంతో క్రికెటర్లు అందరికీ ఫస్ట్ డోస్ ఇచ్చేశాము. ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత యూకే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రెండో డోస్ వేయిస్తాము.

ప్రస్తుతానికి టీమ్ఇండియా క్రికెటర్లు అందరూ క్వారంటైన్‌లో వ్యాయామాలు చేస్తున్నారు. క్రికెట్ సాధన ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత మొదలు పెడతారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. జూన్ 2న మహిళా పురుష జట్లు అన్నీ ఒకే ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ వెళ్లనున్నాయి. అంతకు ముందే మరోసారి క్రికెటర్లు అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..

Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Etela Rajender: ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారు..! కేంద్ర నాయకత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం..