IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌ల సంఖ్యపై కీలక అప్‌డేట్

| Edited By: Janardhan Veluru

Sep 27, 2024 | 12:48 PM

ఇటీవలే అన్ని ఫ్రాంచైజీలు ఐదుగురు ప్లేయర్లను రిటేషన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఎన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటాయనే దానిపై అప్‌డేట్ వచ్చింది. అయితే 2025 ఐపీఎల్‌లో మ్యాచ్‌లు పెంచుతారనే చర్చ జోరుగా జరిగింది. ఈసారి 84 మ్యాచ్‌లు ఆడించాలని బీసీసీఐ యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌ల సంఖ్యపై కీలక అప్‌డేట్
2
Follow us on

భారత్‌లో ఐపీఎల్‌‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు వెయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2025 పై తరుచుగా ఆప్‌డేట్స్ వస్తునే ఉన్నాయి. ఇటీవలే అన్ని ఫ్రాంచైజీలు ఐదుగురు ప్లేయర్లను రిటేషన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఎన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటాయనే దానిపై అప్‌డేట్ వచ్చింది. అయితే 2025 ఐపీఎల్‌లో మ్యాచ్‌లు పెంచుతారనే చర్చ జోరుగా జరిగింది. ఐపీఎల్ 2025, 2026 సీజన్‌లో  84 మ్యాచ్‌లు ఆడించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ESPN తాజా నివేదిక ప్రకారం ఈసారి 84 మ్యాచ్‌లకు బదులు 74 మ్యాచ్‌లే ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలో బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

బీసీసీఐ నిర్ణయం వెనుక కారణం అదేనా?

మొదట ఐపీఎల్ 2025లో 84 మ్యాచ్‌లు ఆడించాలని బీసీసీఐ భావించింది. జూన్‌ నుంచి జరగనున్న టెస్ట్ ప్రపంచ ఛాంపీయన్‌షిప్ మ్యాచ్లు ఉండడంతో ఆటగాళ్ల సన్నద్ధతలో భాగంగా వారికి రెస్ట్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. 2023, 2024 ఐపీఎల్ మాదిరిగా ఈసారి కూడా 74 మ్యాచ్‌లు ఉంటాయి.ఈ అప్‌డేట్ ఐపీఎల్ అభిమానులను నిరాశపరిచినా.. ఆటగాళ్లకు మాత్రం ఊరటనిచ్చే విషయం.

కాగా ఐపీఎల్ 2025 సీజన్ మార్చి రెండో వారం నుంచి మే చివరి వారం వరకు నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.