WPL: జాక్‌పాట్ కొట్టనున్న మహిళా క్రికెటర్లు.. 5 ఫ్రాంచైజీలు రూ. 4670 కోట్లు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే?

భారత క్రికెట్ నియంత్రణ మండలి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రకటించింది. లీగ్‌లోని 5 ఫ్రాంచైజీలను బుధవారం, జనవరి 25న బోర్డు ప్రకటించింది.

WPL: జాక్‌పాట్ కొట్టనున్న మహిళా క్రికెటర్లు.. 5 ఫ్రాంచైజీలు రూ. 4670 కోట్లు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే?
Womens Ipl 2023
Follow us

|

Updated on: Jan 25, 2023 | 4:06 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రకటించింది. లీగ్‌లోని 5 ఫ్రాంచైజీలను బుధవారం, జనవరి 25న బోర్డు ప్రకటించింది. ఇందులో అహ్మదాబాద్ పేరు మీద అత్యధిక బిడ్ వచ్చింది. అదానీ స్పోర్ట్స్‌లైన్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.1289 కోట్లకు కొనుగోలు చేసింది. పురుషుల ఐపీఎల్‌లోని 7 ఫ్రాంచైజీలలో, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్లను కొనుగోలు చేశాయి. మొత్తంగా ఈ వేలం ద్వారా బీసీసీఐ రూ.4669.99 కోట్లు ఆర్జించింది. అలాగే ఈ లీగ్‌కు – ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) అని కూడా పేరు పెట్టింది.

ఈ టీమ్‌లను కొనుగోలు చేసేందుకు చాలా పెద్ద కంపెనీలు బరిలో నిలిచాయి. అదానీ గ్రూప్ అహ్మదాబాద్ జట్టును కొనుగోలు చేసింది. అలాగే బెంగళూరు జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈ జట్లకు కంపెనీలు భారీ మొత్తంలో చెల్లించాయి.మహిళల ప్రీమియర్ లీగ్ జట్లను కొనుగోలు చేయడంలో ఐదు కంపెనీలు విజయం సాధించాయి. అదానీ స్పోర్ట్స్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అహ్మదాబాద్‌ను రూ.1289 కోట్లకు కొనుగోలు చేసింది. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైని రూ.912.99 కోట్లకు కొనుగోలు చేసింది. మహిళల ఐపీఎల్‌లో మూడో జట్టు బెంగళూరు. దీనిని రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు రూ. 901 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీని JSW GMR క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ 810 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ లక్నో మహిళల జట్టును కొనుగోలు చేసింది. రూ. 757 కోట్లు వెచ్చించాడు. మహిళల ప్రీమియర్ లీగ్‌లోని ఐదు జట్ల మొత్తం విలువ రూ.4669.99 కోట్లుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే, మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్నారు. మీడియా నివేదికల మేరకు.. మార్చి 4 నుంచి 26 మధ్య నిర్వహించే ఛాన్స్ ఉంది. దీనికి ముందు మహిళా క్రీడాకారులను వేలం వేయనున్నారు. తొలి సీజన్‌లో 22 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలను ఎంచుకోవచ్చని తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ మీడియా హక్కులను కూడా విక్రయించింది. వయాకాన్18 మీడియా హక్కుల కోసం బీసీసీఐకి భారీ మొత్తం చెల్లించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..