IND vs AUS 1st Test: 104 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా.. 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. భారత్ ఆధిక్యం ఎంతంటే?

|

Nov 23, 2024 | 10:22 AM

Australia vs India, 1st Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సాధించింది. పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం ఆస్ట్రేలియా 67/7 స్కోరుతో ఆడడం ప్రారంభించింది. 37 పరుగుల వద్ద చివరి 3 వికెట్లు కోల్పోయింది.

IND vs AUS 1st Test: 104 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా.. 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. భారత్ ఆధిక్యం ఎంతంటే?
Aus Vs Ind 1st Test Score
Follow us on

Australia vs India, 1st Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సాధించింది. పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం ఆస్ట్రేలియా 67/7 స్కోరుతో ఆడడం ప్రారంభించింది. 37 పరుగుల వద్ద చివరి 3 వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కారీ మొదటి రోజు తన స్కోరుకు 2 పరుగులు మాత్రమే జోడించి మొత్తం 21 పరుగులు చేయగా, నాథన్ లియాన్ 5 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. 26 పరుగులు చేతిన తర్వాత రాణా బౌలింగ్‌లో చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో తొలి రోజైన శుక్రవారం భారత జట్టు 150 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

లంచ్ బ్రేక్.. భారత్ ఖాతాలోనే మొదటి సెషన్..

రెండో రోజు తొలి సెషన్ భారత జట్టు ఖాతాకే చేరింది. ఇందులో భారత బౌలర్లు 37 పరుగులకే 3 వికెట్లు తీశారు. వీరిలో హర్షిత్ రాణాకు 2, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. ఈ ప్రదర్శనతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 46 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించగలిగింది.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..