వెస్టిండీస్‌ వైస్‌ కెప్టెన్‌గా క్రిస్‌గేల్‌

విండీస్‌ ప్రపంచకప్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా క్రిస్‌గేల్‌‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. జాసన్‌ హోల్డర్‌ సారథ్యంలోని ప్రపంచకప్‌ జట్టులో ఈ 39 ఏళ్ల విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ చోటు సంపాదించుకున్నారు. ప్రపంచకప్ అనంతరం వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్న గేల్‌.. జట్టులో తనకు కీలక బాధ్యతలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌ తరఫున ఏ ఫార్మాట్‌కైనా ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ గౌరవంగా భావిస్తానని.. ముఖ్యంగా ప్రపంచకప్‌ తనకు ఎంతో ప్రత్యేకమని గేల్ అన్నాడు. ఓ సీనియర్‌ […]

  • Publish Date - 4:41 pm, Tue, 7 May 19 Edited By:
వెస్టిండీస్‌ వైస్‌ కెప్టెన్‌గా క్రిస్‌గేల్‌

విండీస్‌ ప్రపంచకప్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా క్రిస్‌గేల్‌‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. జాసన్‌ హోల్డర్‌ సారథ్యంలోని ప్రపంచకప్‌ జట్టులో ఈ 39 ఏళ్ల విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ చోటు సంపాదించుకున్నారు. ప్రపంచకప్ అనంతరం వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్న గేల్‌.. జట్టులో తనకు కీలక బాధ్యతలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

వెస్టిండీస్‌ తరఫున ఏ ఫార్మాట్‌కైనా ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ గౌరవంగా భావిస్తానని.. ముఖ్యంగా ప్రపంచకప్‌ తనకు ఎంతో ప్రత్యేకమని గేల్ అన్నాడు. ఓ సీనియర్‌ ఆటగాడిగా జట్టులో కెప్టెన్‌తోపాటు ఇతర ఆటగాళ్లకు మద్దతు ప్రకటించడం నా బాధ్యతని.. బహుశా ప్రపంచకప్‌టోర్నీల్లో ఇదే అతిపెద్ద టోర్నీఅని.. అందువల్ల మాపై భారీగా అంచనాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. విండీస్‌ అభిమానులను సంతృప్తి పరచడానికి మేం బాగా ఆడతామని గేల్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ జట్టు తరపున ఆడిన గేల్ 13 మ్యాచ్‌లు ఆడి మొత్తం 490 పరుగులు చేసి.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.