టీమిండియా బౌలర్ షమిపై చార్జ్‌షీట్

కోల్‌కతా: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిపై చార్జిషీట్ నమోదయ్యింది. షమీ భార్య హసీన్ జహన్ చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో కోల్‌కతాలో పోలీసులులోని మహిళల గ్రీవెన్స్ సెల్ పలు సెక్షన్ల కింద చార్జిషీటు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, సెక్షన్ 354ఏ కింద పోలీసులు చర్యలు తీసుకున్నారు. 498ఏ అంటే వరకట్నం కోసం వేధింపులు, 354ఏ అంటే లైంగికంగా ఇబ్బంది పెట్టడం మహిళ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం. త్వరలో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్‌లో […]

టీమిండియా బౌలర్ షమిపై చార్జ్‌షీట్

కోల్‌కతా: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిపై చార్జిషీట్ నమోదయ్యింది. షమీ భార్య హసీన్ జహన్ చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో కోల్‌కతాలో పోలీసులులోని మహిళల గ్రీవెన్స్ సెల్ పలు సెక్షన్ల కింద చార్జిషీటు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, సెక్షన్ 354ఏ కింద పోలీసులు చర్యలు తీసుకున్నారు. 498ఏ అంటే వరకట్నం కోసం వేధింపులు, 354ఏ అంటే లైంగికంగా ఇబ్బంది పెట్టడం మహిళ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం.

త్వరలో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్‌లో షమీ ఆడే అవకాశం ఉండటంతో ఇప్పుడీ చార్జిషీటు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది. షమీకి, అతని భార్యకు చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ కుటుంబ గొడవల నేపథ్యంలో షమీతో కాంట్రాక్ట్ కొనసాగించాలా వద్దా అని బీసీసీఐ గతంలో విచారణ కూడా జరిపింది. అంతర్గత విచారణ అనంతరం కొనసాగించేందుకే నిర్ణయించింది.

Click on your DTH Provider to Add TV9 Telugu