వరల్డ్ కప్‌ యుద్ధంలో పట్టు బిగించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: భారత్ – పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అదొక యుద్ధంలా ఉంటుంది. ఆటగాళ్ల సంగతి పక్కన పెడితే ఇరు దేశాల ప్రజల్లో మాత్రం భావోద్వేగాలు హై పిచ్‌లో ఉంటాయి. అలాంటిది ఉగ్రదాడులు జరిగిన సందర్భంలో అయితే అగ్ని గుండంలా మారుతుంది. తాజాగా అదే పరిస్థితి ఉంది. అది కూడా ప్రపంచ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరింత హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత జట్టు మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వస్తే ఏం […]

వరల్డ్ కప్‌ యుద్ధంలో పట్టు బిగించిన బీసీసీఐ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:42 PM

న్యూఢిల్లీ: భారత్ – పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అదొక యుద్ధంలా ఉంటుంది. ఆటగాళ్ల సంగతి పక్కన పెడితే ఇరు దేశాల ప్రజల్లో మాత్రం భావోద్వేగాలు హై పిచ్‌లో ఉంటాయి. అలాంటిది ఉగ్రదాడులు జరిగిన సందర్భంలో అయితే అగ్ని గుండంలా మారుతుంది. తాజాగా అదే పరిస్థితి ఉంది. అది కూడా ప్రపంచ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరింత హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత జట్టు మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలనేది పెద్ద సమస్యగా మారింది. మ్యాచ్ ఆడకూడదని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆడాలని వాదించే వాళ్లు లేకపోలేదు.

కానీ బీసీసీఐ మాత్రం ఈ విషయంలో పట్టు మీద ఉంది. పాక్‌తో మ్యాచ్ ఆడేది లేదని గట్టిగా చెబుతోంది. భారత ప్రభుత్వం ఆదేశిస్తే వరల్డ్ కప్‌లో పాక్‌తో ఆడాల్సి వచ్చే మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేస్తామని ఒక బీసీసీఐ అధికారి ప్రకటించారు. అయితే ఆయన మరో విషయం కూడా చెప్పారు. ఒకవేళ భారత్ అలా చేస్తే పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందని, అవి పాకిస్థాన్‌కు మ్యాచ్ గెలవకుండానే వెళతాయని చెప్పారు. అదే ఫైనల్ మ్యాచ్ అయితే ఆడకుండానే కప్ అందుకునే పరిస్థితి ఉంటుందని వివరించారు. అయితే ఈ విషయాన్ని ఐసీసీతో ఇంతవరకూ చర్చించలేదని కూడా ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 27వ తేదీన దుబాయ్‌లో వరల్డ్ కప్‌కు సంబంధించి కీలక సమావేశం జరగనుంది. దీనికి భారత్ తరుపున బీసీసీఐ ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ, బీసీసీఐ సెక్రెటరీ అమితాబ్ చౌదరి పాల్గొంటారు. ఇందులో ఈ భారత్-పాక్ మ్యాచ్‌ల గురించి చర్చకు రానుంది. ఈ విషయంపై ఇప్పటికే ఐసీసీ చీఫ్ డేవిడ్ రిచర్డ్‌సన్ స్పందించారు. తాము రెండు క్రికెట్ బోర్డుల మధ్య ఉన్న పరిస్థితిని, అయితే ఇండియా-పాక్ మ్యాచ్‌పై అభ్యంతరం తెలుపుతూ ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.

అయితే ప్రజలను కలిపే అద్భుతమైన శక్తి క్రీడలకు ఉందని, క్రికెట్‌ ఆ పని చేయగలదని అన్నారు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జూన్-16న జరగాల్సి ఉంది. కానీ పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడొద్దంటూ కోరుతున్నారు. ఫిబ్రవరి 14 పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్లు కన్నుమూసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి చేసింది తామేనని ప్రకటించింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..